YouTuber Praneeth Hanumanthu Produced in Nampally Court: సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతు తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న బెంగళూరు నుంచి పిటి వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు ప్రణీత్ ను విచారించినట్లు తెలుస్తోంది. ఇక సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రణీత్ హనుమంతును విచారించి నాంపల్లి కోర్టు ముందు హాజరు పరిచినట్టు చెబుతున్నారు. మొత్తంగా ప్రణీత్ హనుమంతు మీద నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Prabhu Deva: ప్రభుదేవా ఇంట తీవ్ర విషాదం
ప్రణీత్ తో పాటు లైవ్ స్ట్రీమింగ్ లో ఉన్న మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ప్రణిత్ మీద 67B ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్, 79, 294 BNS సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయగా అదే స్ట్రీమింగ్ లో పాల్గొన్న మరో ముగ్గురు నిందితులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో A2గా డల్లాస్ నాగేశ్వర్ రావు A3గా బుర్రా యువరాజ్ A4గా సాయి ఆది నారాయణలపై కేసులు నమోదు చేశారు.