Site icon NTV Telugu

Poonam Kaur :హీరోయిన్ కోసం భార్యను కోమాలోకి పంపాడు- డైరెక్టర్‌పై పూనమ్ షాకింగ్ కామెంట్స్

Punam Cour

Punam Cour

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎవరి గురించి అయినా ఎలాంటి బెరుకు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఇందులో భాగంగా తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని రేపుతున్నాయి. ఒక డైరెక్టర్ మరొక హీరోయిన్ మోజులో పడి, తన కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడని పూనమ్ బయటపెట్టారు. ఆ డైరెక్టర్ కొట్టిన దెబ్బలకు ఆ మహిళ ఏకంగా వారం రోజుల పాటు కోమాలోకి వెళ్లిందని, ఈ దారుణం మన తెలుగు ఇండస్ట్రీలోనే జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ హీరోయిన్ ఆడియో ఫంక్షన్‌లలో స్టేజ్‌పై కనిపిస్తుంటే, భార్య మాత్రం అనుభవించిన నరకాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయిందని పూనమ్ చెప్పుకొచ్చారు.

Also Read : Nani: నాని లైనప్‌లో మరో క్రేజీ మూవీ..?

దీంతో గతంలో “మరో ఆడదాని కోసం భార్యను ఇలా హింసిస్తారా? మన ఇల్లు బాగుండాలని పక్కవారి ఇల్లు కూల్చడం సరైనదేనా?” అంటూ పూనమ్ వేసిన ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఆ డైరెక్టర్ ఎవరు, ఆ హీరోయిన్ ఎవరు? పేర్లను ఆమె నేరుగా వెల్లడించలేదు. కానీ, ఈ వ్యాఖ్యలు సమంత-రాజ్ నిడిమోరు పెళ్లి వార్తల సమయంలోనే రావడం సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు దారితీస్తోంది. నెటిజన్లు రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నప్పటికీ, పూనమ్ మాత్రం ఎవరి పేర్లు ప్రస్తావించకుండా ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని ఎండగట్టారు. ఈ వ్యవహారం టాలీవుడ్‌లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది.

Exit mobile version