Site icon NTV Telugu

Poonam Kaur : పోసాని కారణంగా.. నా సర్వస్వం కోల్పోయా – పూనమ్ కౌర్ సెన్సేషనల్ కామెంట్స్.

Punam, Kour, Posani Krishnamurali

Punam, Kour, Posani Krishnamurali

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ఏదో ఓ వివాదంలో ఇరుకుంటూ అస్తమానం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం మరియు కెరీర్ నాశనం కావడానికి గల కారణాలను వివరిస్తూ కన్నీరు పెట్టుకుంది పూనమ్. అసలు ఏం జరిగింది అంటే..

Also Read : Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు‘ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా?

నటుడు పోసాని కృష్ణమురళి మైక్ పట్టుకున్నాడు అంటే కచ్చితంగా ఏదో ఒక రచ్చ జరగాల్సిందే. ఇందులో భాగంగా ఆయన ఒక ప్రెస్ మీట్ పూనమ్ జీవితాన్ని మలుపు తిప్పిందని, దీనివల్ల తాను సర్వం కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పూనమ్ మాట్లాడుతూ.. ‘నేను ఒక పెద్ద మనిషి దగ్గర డబ్బులు తీసుకుని రాజీపడ్డానని దుష్ప్రచారం చేశారు. నా తల్లి గురుద్వారాకు వెళ్తే.. ‘కూతురిని డబ్బు కోసం అమ్మేశావా?’ అని జనం నిలదీశారు. ఆ సమయంలో మా బంధువులు కూడా నన్ను నమ్మలేదు. నన్ను తొక్కేయడానికి కొందరు 15 కోట్లు ఖర్చు చేశారు’ అని సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల వల్ల తన పెళ్లి ఆగిపోయిందని పూనమ్ చెప్పారు.

‘నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక స్నేహితుడు ముందుకు వచ్చిన సమయంలో, పోసాని ప్రెస్ మీట్ పెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. దీంతో ఆ వ్యక్తి నాకు దూరమయ్యాడు. ఆ ఘటన తర్వాత మా అమ్మకు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి నాకు పెళ్లి పై విరక్తి కలిగింది. ఆ ఒక్క ప్రెస్ మీట్ నా ఆరోగ్యం, సంతోషం, కెరీర్.. అన్నింటినీ నాశనం చేసింది’ అంటూ పూనమ్ కౌర్ ఎమోషనల్ అయ్యారు. దర్శకుడు దాసరి నారాయణరావు బతికి ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

Exit mobile version