NTV Telugu Site icon

Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో సెంటిమెంట్ కాదు.. డెవలప్‌మెంట్ మొదలైంది

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar Visits Husnabad: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తన సొంత నియోజకవర్గ హుస్నాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. మంత్రిగా ఛార్జ్ తీసుకున్న అనంతరం తొలిసారి హుస్నాబాద్‌కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడారు. ‘ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్‌కు మెడికల్ కాలేజీ తెచ్చే బాధ్యత నాది. సెంటిమెంట్ కాదు హుస్నాబాద్‌లో డెవలప్‌మెంట్ మొదలైంది. భూనిర్వాసితులను బతిమిలాడైనా గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయిస్తా.

Also Read: UP Murder Case: లాయరైన నిందితుడు.. తన కేసు తానే వాదించుకుని నిర్దోషిగా బయటకు..

హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నా. ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. నియోజకవర్గంలో ప్రతి ఊరికి వెళ్లి ప్రజల సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరిస్తా. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ మార్పు తీసుకొస్తా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి ఉమ్మడి జిల్లాను ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తాం. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికెళ్లిన గళ్ళ ఎగిరేసుకునే విధంగా పనిచేస్తా. రాజకీయంగా నాకు మరోసారి జన్మనిచ్చిన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతా. ప్రతిరోజు ఉదయం హుస్నాబాద్‌లో ఉంటే, సాయంత్రం హైదరాబాద్‌లో ఉంటా.. సాయంత్రం హైదరాబాద్‌లో ఉంటే ఉదయం హుస్నాబాద్‌లో ఉంటా’ అని వ్యాఖ్యానించారు.

Also Read: YSRCP: గెలుపే లక్ష్యం.. సిట్టింగ్‌లను మారుస్తూ సీఎం జగన్‌ సంచలన నిర్ణయం