NTV Telugu Site icon

Ponnam Prabhakar : అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Ponnam Prabhakar

Ponnam Prabhakar

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడంతో నాళాల వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మాన్ హోల్స్ వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో నగరంలో వచ్చే రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ , వాటర్ వర్క్స్ , విద్యుత్ ,పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. డిఆర్ఎఫ్ , ఎన్డిఆర్ఎఫ్ బృందాలు , ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

Alcohol: మద్యం ప్రియులూ.. మందు తాగేటప్పుడు ఈ స్టఫ్ తినండి..శరీరానికి మంచిది

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ,ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ఉండడంతో పాటు , ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు… హైదరాబాద్ లో భారీ వర్షం కురిసినప్పుడు నీళ్ళు నిల్వ ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడే ఉండి నీళ్ళు వెంటనే వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైతే వర్షం కురిసి ఇబ్బందులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో అధికారులకు ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.. సమస్య తీవ్రమైతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అధిక వర్షపాతం ఉన్న ప్రదేశాల్లో ప్రత్యెక చర్యలు తీసుకోవాలని ఇక్కడ జిహెచ్ఎంసి బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Pantham Nanaji: రంగరాయ మెడికల్ కాలేజ్ వైస్ చైర్మన్ని దుర్భాషలాడిన ఎమ్మెల్యే నానాజీ..