NTV Telugu Site icon

Ponnam Prabhakar : మాకు ఎవరు ఇస్తారు అవకాశాలు అనుకోకూడదు..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్తూ పార్టీని ముందుకు నడిపిన వ్యక్తిగా పీసీసీగా నియామకం అయ్యారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర NSUI అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కరీంనగర్ NSUI అధ్యక్షుడిగా ఉన్నాని ఆయన అన్నారు. మహేష్ అన్న నాకంటే ఎక్కువ శ్రమ పడ్డారు.. అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్నారని, వారసత్వ రాజకీయాలు కాకుండా క్షేత్ర స్థాయిలో బలహీన వర్గాల నుండి జెండా పట్టుకొని పైకి వచ్చామన్నారు పొన్నం ప్రభాకర్‌. మాకు ఎవరు ఇస్తారు అవకాశాలు అనుకోకూడదని, పోరాట చేయాలి గుంజుకోవాలి.. కొట్లాడాలన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ జీత్నా హిస్సేదారి ఉత్నా బాగీదారి అని కుల గణన చేసి తీరుతామని పార్లమెంట్ లో చెప్పారని, రాబోయే తరాలలో బలహీన వర్గాలు ఎస్సి ఎస్టీ లకు న్యాయం జరుగుతుందన్నారు. బలహీన వర్గాల మంత్రిగా కుల గణన కు సంబంధించి అసెంబ్లీ లో బిల్లు పెట్టుకున్నాం.. నిధులు కేటించుకున్నామన్నారు మంత్రి పొన్నం.

Balineni Srinivasa Reddy: కాసేపట్లో జనసేన అధినేతతో బాలినేని భేటీ..

అంతేకాకుండా..’బీసీ కమిషన్ ఏర్పడిన వారం రోజుల్లోనే కుల గణన పై కమిటీ వేశాం.. కుల గణన పై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మీరు ఏం చేసిన కుల గణన చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ది.. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ లకు న్యాయం జరిగేలా రిజర్వేషన్ ల ప్రక్రియలో ఎన్నికలు జరుగుతాయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో బీసీ ల ప్రాధాన్యత ఉండాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.. పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం.. మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి వచ్చాం.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనీ చేస్తున్నాం.. మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో మేము ప్రభుత్వంలో బలహీన వర్గాలకు ఎస్సి ,ఎస్టీ, బీసీ లకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేయాలి.. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం.. విద్యార్థి స్థాయి నుండి వచ్చి ఎన్ని కష్టాలు వచ్చిన జెండా వదలకుండా పార్టీ మారకుండా పార్టీలోని ఉన్నాం.. పార్లమెంట్ సభ్యుల ఓబీసీ కన్వీనర్ గా పని చేశాం..అనేక రాష్ట్రాలు తిరిగాం.. గత ప్రభుత్వం లో బీసీ లకు.. 27 శాతం రిజర్వేషన్లు కూడా అమలు కాలేదు.. 10 సంవత్సరాలుగా బీజేపీ బలహీన వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది.. ఈ అంశాలను బయటకు రానివ్వడం లేదు.. బలహీన వర్గాలకు అండగా ఉంటూ మాకు రావాల్సిన హక్కులపై ఉండాలి.. ఇది సన్మానం కాదు.. బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేసే దిశలో భారం గా ఉండాలి.. పార్టీని బలోపేతం చేస్తూ మనమంతా కలిసి ముందుకు పోవాలి.. NSUI బిడ్డగా రాష్ట్ర అధ్యక్షులు అయినా మీకు తమ్ముడిగా మీకు శుభాకాంక్షలు.. మీకు అన్ని రకాలుగా శుభం జరగాలని కోరుకుంటున్న’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు.

Pak Defense Minister Khawaja Asif: “కాంగ్రెస్-ఎన్సీకి మా మద్దతు ఉంటుంది”.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Show comments