NTV Telugu Site icon

Ponnam Prabhakar : ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు.. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా…?

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు అందోళన చెందవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుందన్నారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు నుండి గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతుండడంతో అక్కడికి వెళ్లి అధికారుల వద్దకు రేషన్ కార్డులు రానివారు కానీ, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక విషయంలో గ్రామ సభల్లోనే ఎంపిక చేయనున్నారని ఆయన తెలిపారు. ఎవరికైనా అర్హత ఉండి రానివారు ఉంటే గ్రామ సభలో అప్లికేషన్ లు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం. ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు .. వారు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా…? అని ఆయన ప్రశ్నించారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న 10 వేల రూపాయలను 12 వేలకు పెంచడం జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. దేశంలోనే మొదటి సారిగా భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు 12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు.

Disha Patani : దిశా పటానీ హాలీవుడ్ ఎంట్రీ..షూట్ నుండి పిక్స్ వైరల్

ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ ఆరోగ్య శ్రీ నీ 5-10 లక్షలకు పెంచుకున్నామని ఆయన తెలిపారు. రైతులకు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశామని, ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, సన్న వడ్ల కు 500 బోనస్ ఇచ్చాం.. గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం సేకరణ చేసిన 48 గంటల్లోపు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశామని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల మాదిరి ఈనెల లోనే మరో 4 పథకాలు ప్రారంభం కానున్నాయని, ప్రజలు ఎవరు అధైర్యపడవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తిస్తాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. గ్రామాల్లో నేటి నుండి గ్రామ సభలు జరుగుతుండడంతో ఎవరికైనా అర్హత ఉండి రేషన్ కార్డు , ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారుల ఉంటే అధికారులకు మీ పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి అని, కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేషన్ కార్డుల , ఇందిరమ్మ ఇళ్ల పై జరుగుతున్న తప్పుడు సమాచారం పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వారికి కాంగ్రెస్ క్యాడర్ అండగా నిలబడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌.

Tollywood : బడా నిర్మాతల ఇల్లు, ఆఫీసులో ఐటి అధికారుల దాడులు