Site icon NTV Telugu

Ponnala Lakshmaiah : అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని రాజకీయాలు మాట్లాడారు

Ponnala Lakshmaiah On Ktr

Ponnala Lakshmaiah On Ktr

అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని రాజకీయాలు మాట్లాడారని మండిపడ్డారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పొన్నాల లక్ష్మయ్య. ఆయన ఇవాళ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వమేమో సమస్యలపై మాట్లాడకుండా సైలెంట్‌గా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నిసార్లు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్లే రైళ్లలో ఎన్ని సౌలతులు కల్పించారు? అని ఆయన అన్నారు. మోడీని చూస్తుంటే తుపాకీ రాముడు, పిట్టల దొరలాగా కనిపిస్తున్నడంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

 

Also Read : Pushpa 2: అల్లు అర్జున్ చీర కట్టడం వెనుక ఇంత కథ ఉందా.. సుక్కు.. నువ్వు మాములోడివి కాదు సామీ..?

నిరుద్యోగం గురించి మాట్లాడే దమ్ముందా? 2 కోట్ల ఉద్యోగాలేవి? అని లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. బాతాలు కొట్టి, బాకా ఊది, జెండా ఊపి వెళ్లి పోయిండు అంటూ ఆయన మోడీపై సెటైర్లు వేశారు. లిక్కర్ స్కామ్‌లో ముఖ్యమైన వ్యక్తిని భలే తొందరగా అరెస్ట్ చేశారు కదా…!? అంటూ ఆయన చురకలు అంటించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని..‌ తిరుపతి ఆలయంతో ముడిపెట్టడమా? అంటూ ఆయన విమర్శలు చేశారు. దేశంలో ఎగుమతులు తగ్గుతున్నాయని, దిగుమతులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా.. మతం‌ పేరును వాడుకోవడం సిగ్గు చేటు అని పొన్నాల అన్నారు.

Also Read : Arman Malik: అల్లు అర్జున్ కి పాడేసాను… మహేష్ బాబుకి బాలన్స్ ఉంది…

Exit mobile version