NTV Telugu Site icon

Ponnala Lakshmaiah : ఎర్రకోట ప్రసంగాన్ని ప్రధాని మోడీ రాజకీయాల కోసం వాడుకున్నారు

Ponnala

Ponnala

ఎర్రకోట ప్రసంగాన్ని ప్రధాని మోడీ రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. మణిపూర్ శాంతి నెలకొంటుంది అంటున్న ప్రధాని పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అంశం ఎందుకు మాట్లాడలేదన్నారు. ప్రధాని మణిపూర్ లో పర్యటించి ప్రజలకి విశ్వాసం కలిగించి ఉంటే బాగుండేదని, ఏమి చేయలేదు కానీ ఎర్రకోట వేదికగా మణిపూర్ గురించి మోడి మాట్లాడారన్నారు. ప్రధాని మోడీ బీజేపీ నాయకులు ఎవరైనా మణిపూర్ లో పర్యటించారా ? అని ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో ప్రధాని ఏం చేశారు.. గంట కొట్టారు , దీపాలు పెట్టారు , చప్పట్లు కొట్టారు దానివల్ల కోవిడ్ ఏమైనా తగ్గిందా ? రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించకుండా దొంగచాటుగా వ్యాక్సిన్లు తయారు చేసే వాళ్ళకి పవర్ ఇస్తారు ..ఇలానే ప్రధానమంత్రి చేస్తారా ? అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

Also Read : Thomas Reddy : వెంటనే గవర్నర్ ఆర్టీసి విలీన బిల్లు ఆమోదం తెలపాలి

అంతేకాకుండా.. ‘కోట్లాదిమంది ప్రజలు పాదయాత్రలు, సైకిల్ యాత్రల ద్వారా తమ గమ్య స్థలానికి చేరుకున్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నారు తప్ప లక్షలాది మంది ప్రజల ఉద్యోగాలు కోల్పోయారు, తమ పిల్లలు తో సహా తమ స్వస్థలాలకు వెళ్లారు. కేంద్ర రాష్ట్రాలు గ్యాస్ , పెట్రోల్, డీజిల్ పైన టాక్స్ ఎందుకు తగ్గించడం లేదు. దేశం జనాభా లో 90శాతం మంది సామాన్య ప్రజలలే GST కడుతున్నారు. ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు, 2 కోట్లు ఉద్యోగాలు, నల్ల ధనం లేకుండా చేస్తాం, ఇల్లు , విద్యుత్ , నీరు దేశంలో ప్రతిఒక్కరికి అందిస్తామని చెప్పారు … ఏమైనా నెరవేర్చరా ? 9 ఏళ్ల పాలనలో మహిళల రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉంది. బీజేపీకి అవకాశం ఉన్న ఎందుకు చేయడంలేదు. పార్టీ ఫిరాయింపుల చట్టం 9 ఏళ్ళు నుండి పెండింగ్ లో ఉంది. 9 రాష్ట్రాల ప్రభుత్వాలు ను కూలగొట్టిన నీచ ప్రభుత్వం బీజేపీది’ అని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.

Also Read : Devineni Avinash: రాష్ట్రాభివృద్ధిపై టీడీపీకి దమ్ముంటే చర్చకు రావాలి

Show comments