తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత వారం పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల కట్టలు తెగిపోవడంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. అయితే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో.. ఖమ్మం జిల్లా బొక్కల గడ్డలో ముంపు వాసులకు నిత్యావసర వస్తువులు అందజేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
Also Read : ALERT: కరోనా ఇంకాపోలేదు.. ఇండోనేషియాలో బయటపడిన వేరియంట్..!
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ముందు గత వరదలకు మీరు ప్రకటించిన 1000 కోట్లు ఇవ్వండని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. 35 ఏళ్ల క్రితం వచ్చిన వరదలు మళ్లీ ఇపుడు వచ్చాయని, ఒక్క కుటుంబం, రైతు ఇబ్బంది పడకుండా కరకట్ట ఇస్తా అన్నారని, ముంపుకు గురికాకుండా మరోచోట ఇళ్ళు కట్టిస్తాం అన్నారని ఆయన గుర్తు చేశారు. 9 ఏళ్ళు పాలించిన వారిని ప్రశ్నిస్తున్నానని, మున్నేరు ఇవ్వాల్టిది కాదు కదా మంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు. 9 ఏళ్లలో చేయని అభివృద్ధి ఈ మూడు నెలల్లో చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Girl friend for free: గర్ల్ ఫ్రెండ్ లేదని బెంగ ఎందుకు.. ఇది ఫాలో అవ్వండి చాలు..
ప్రజలకు చెవులో పువ్వులు పెట్టే మాటలు మానండని, కరకట్ట కట్టి తీరుతామని ఆయన అన్నారు. కరకట్ట కాంక్రీట్ తో కడతామని, కరకట్ట అంటే ఏంటో….కాంక్రీట్ అంటే ఎంటో నీకు తెలుసా మంత్రి అని ఆయన హెద్దేవా చేశారు. నాకు తెలుసు కరకట్ట సిమెంట్ కాంక్రీట్ తో నిర్మిస్తామని, ఇల్లు మునిగిన ప్రతి కుటుంబానికి 25 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వరదల్లో మరణించిన కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు పొంగులేటి.