NTV Telugu Site icon

Transfers : రాష్ట్రంలో 70 మంది రెవెన్యూ అధికారుల బదిలీ

Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

Transfers : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖలో పెద్ద మార్పులను ప్రారంభించారు. ఆయన పుట్టిన రోజునే 70 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఒకేసారి బదిలీ చేశారు. ఇటీవల రెవెన్యూ సంఘాలు ప్రమోషన్స్ , బదిలీలపై మంత్రిని కలిసి ప్రస్తావించడంతో, ఈ మార్పులు జరిగినాయి. ఈ బదిలీల విండో చర్చనీయాంశంగా మారింది, ఎందుకంటే పలు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, భూ సేకరణ అధికారులు , సివిల్ సప్లయిస్ శాఖల్లో పనిచేసే అధికారులను కూడా బదిలీ చేశారు. కొందరు తమ కోరిక మేరకు స్థానాలు పొందలేక పోయారు, అయితే మరికొందరు ప్రాధాన్యత కలిగిన డివిజన్లకు అనూహ్యంగా బదిలీ అయ్యారు.

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తర్వాతి టార్గెట్ పప్పు యాదవ్..

వేడింగ్‌లో ఉన్న పది ఆర్డీవోలకు పోస్టింగ్స్ లభించాయి, కానీ డిప్యూటీ కలెక్టర్లు ఎల్. రమేష్, ఎన్. ఆనంద్ కుమార్, వి. హనుమా నాయక్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వీరిని రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా విస్తరణ, కొత్త ఆర్వోఆర్ చట్టం, భూమాత చట్టం, పెండింగ్ భూ సమస్యల పరిష్కారం , ప్రభుత్వ స్థలాల రక్షణ వంటి అనేక అంశాల నేపథ్యములో ఈ బదిలీలు జరిగాయని సమాచారం. భూ పరిపాలనలో అనేక సంస్కరణలు త్వరలో రానున్నాయి. వీటన్నింటిని సమర్ధంగా అమలు చేయడానికి అవసరమైన ప్లాట్ ఫారాన్ని మంత్రి పొంగులేటి ఏర్పాటు చేస్తున్నారు.

Cheating: పూజల పేరుతో ఘరానా మోసం.. 37 లక్షలు టోకరా

Show comments