Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy : భద్రాచలం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

Ponguleti

Ponguleti

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన కేసీఆర్ ప్రజలను మోసం చేశారు విలేకరులను మోసం చేశాడు మోసం చేశాడన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాముడికి పట్టు వస్త్రాలు కూడా తీసుకురాకుండా ప్రజల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి కేసీఆర్‌ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ చెప్పిన మాట చెప్పకుండా ఇచ్చిన మీ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మభ్య పెట్టాడు మరల మూడోసారి ముఖ్యమంత్రి కావాలని తప్పుడు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నాడని ఆయన మండిపడ్డారు. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక అభ్యర్థి పొదుపు వీరయ్య గారిని గెలిపించాలని కోరుతున్నానని ఆయన అన్నారు.

Also Read : Kichannagari Laxma Reddy: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కిచన్న గారి లక్ష్మారెడ్డి

వీరయ్య గారు ఎంత నీతిమంతుడో నిజాయితీపరుడు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని, 2018లో గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన దౌర్భాగ్యుడు వీరయ్య గారిని మాత్రం కొనలేకపోయాడు అంతటి మంచి వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత మనదన్నారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. 30 కోట్లు ఇస్తానని చెప్పిన కూడా మూడు రంగుల జెండాని వదలని వ్యక్తి వీరయ్య. తిరగడానికి డీజిల్ డబ్బులు లేకపోయినా పార్టీని వీడని ఇటువంటి మంచి వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిదీ అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం పొదెం వీరయ్య మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ భద్రాచలం నిర్వీర్యం చేసి ఐదు పంచాయతీలు అడిగిన ఇవ్వకుండా ఉన్న పట్టణాన్ని మూడు ముక్కలు చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామా లేదా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామన్నారు. భద్రాచలం అభివృద్ధి చేయాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు పోదెం వీరయ్య.

Also Read : Covid-19 Vaccination: “ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు”.. టాప్ మెడికల్ బాడీ వెల్లడి..

Exit mobile version