తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని చెప్పారు. బోథ్, ఖానాపూర్, వైరా, కోరుట్ల, ఉప్పల్, ఆసిఫాబాద్, వేములవాడతో సహా ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది బీఆర్‌ఎస్ అధిష్టానం. అయితే.. “మేము 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాము.
Also Read : Prabhas: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్.. ప్రభాస్ రియాక్షన్ చూశారా .. ?
గత ఎన్నికల కంటే పెద్దగా మార్పులు లేవు. కేవలం 7 మార్పులు మాత్రమే ఉన్నాయి. ఈ 7 మందిలో మన వేములవాడ ఎమ్మెల్యే లాంటి మంచి నాయకులున్నారు. అయితే అతనిపై కొనసాగుతున్న కేసు కారణంగా మేము అతనిని మార్చవలసి వచ్చింది. వేములవాడ, బోథ్, స్టేషన్‌ఘన్‌పూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారు’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
Also Read : Prabhas: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్.. ప్రభాస్ రియాక్షన్ చూశారా .. ?
కొత్తగూడెంలో బీఅర్ఎస్ తొలి జాబితా పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతో ఆర్భాటంగా కేసీఆర్ అభ్యర్థుల జాబితా విడుదల చేసారని, ప్రజలతో ఎటువంటి మైండ్ గేమ్ ఆడుతున్నారో కూడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రజలను మభ్యపెట్టి, మోసంచేసి మరోమారు గద్దెనెక్కడంలో భాగంగానే అభ్యర్థులను ప్రకటించారని పొంగులేటి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు విడుదల చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల అరాచకాలు, దోపిడీలను గతంలో కేసీఆర్ అనేక వేదిక లపై ఊటంకించారని ఆయన అన్నారు.