ఖమ్మం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలో మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం… అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేద విద్యార్థికి ఉచిత కోచింగ్ ఇప్పిస్తామన్నారు. వైన్ షాప్ టెండర్లు వేయడానికి 15 రోజులు గడువు ఇచ్ఛిన కేసీఆర్.. గృహ లక్ష్మి పథకానికి దరఖాస్తు కు మాత్రం మూడు రోజులు గడువు ఇచ్చారని మండిపడ్డారు.
Also Read : Prabhas: ‘సలార్’ బిగ్ షాక్? అంత పని చేయకు నీల్ మావా…
మాయల ఫకీరు మాటలు నమ్మి మీరు ఉన్న గుడిసెలు పికీసుకుంటే మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లకు రూ. 5 లక్షలు ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ 2 లక్షల రుణాలు మాఫీ చేస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా.. మరో 90 రోజుల్లో కాంగ్రెస్ అదాకారంలోకి రాబోతుందని, భద్రాచలం రాముడ్ని మోసం చేసిన ఘనత కేసీఆర్‌కి మనల్ని మోసం చేయడం ఎంత పని అన్నారు.
Also Read : Sucide Selfie Video : మా భూమిని కబ్జా చేసారు.. దంపతుల సెల్ఫీ వీడియో.. సూసైడ్ లెటర్….!
కాంగ్రెస్ పార్టీ హయాంలో వైస్ రాజశేఖర రెడ్డి అడిగిన వారికల్లా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు.. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. కాళ్లు అరిగేలా తిరిగినా ఇవ్వలేదు అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఇప్పుడు చెప్పే మాటలన్నీ ఎన్నికల కోసమే.. రాబోయే మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేస్తుంది అని తెలిపారు.