NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : 15 ఏళ్లుగా నత్తనడకగా దేవదుల ప్రాజెక్ట్

Ponguleti

Ponguleti

2026 మార్చి నాటికి పూర్తి చేస్తాము. సోనియా గాంధీ తో ప్రారంభిస్తాం అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు 300 రోజుల పాటు నీటి యెత్తిపోసేలా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం అన్నారు.. పెండింగ్ బిల్ అన్ని క్లియర్ చేస్తాం అన్న మంత్రులు.. పొరుగు రాష్ట్రాల తో సత్ సంబంధాలతో ఉంది త్వరితగతిన ప్రాజెక్టు పనుల చేపడతాం అన్నారు. గత ప్రభుత్వం కేవలం పనులు చేశారు జేబులు నింపుకున్నారు కానీ ప్రజలకు లాభం జరగలేదు. లక్ష 80 వేల కోట్లు ఇరిగేషన్ శాఖ పైనా ఖర్చు చేసిన బి అర్ ఏస్ పనుల పేరుతో జేబులు నింపుకున్నరు.. ప్రాజెక్టుల పని పేరుతో గత ప్రభుత్వా నేతలు దక్కైట్ లాగా దోచుకున్నారని విమర్శించారు

ములుగు జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల పంపింగ్ స్టేషన్ ను సందర్శించి, ప్రాజెక్టు ఇంటెక్ వెల్, పంప్ హౌస్ ను పరిశీలించారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంపై అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

Etela Rajender : గెలుపు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలవడమే కాదు
2025 డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. 2026 మార్చ్ లో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 38 టీఎంసీల నీరు ఎత్తిపోయడానికి ప్రాజెక్ట్ డిజైన్ చేశారని ప్రస్తుతం సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం వల్ల 60 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందన్నారు మంత్రి ఉత్తమ్. సంవత్సరంలో 300 రోజులపాటు 60 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు.

గత పది ఏళ్ల కెసిఆర్ హయంలో దేవాదుల ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని, కమిషన్ల కక్కుర్తి కోసం కేసీఆర్ ప్రాజెక్టులను ఆగం చేశారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. ఇరిగేషన్ శాఖ అడ్డుపెట్టుకుని కేసీఆర్ దోపిడీకి తీరలేపారని ఫైర్ అయ్యారు. ప్రతి ప్రాజెక్టులోను వేలకోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. 1.81 లక్షల కోట్ల నిధులను ఇరిగేషన్ శాఖకు ఖర్చుచేసినా లక్ష ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వలేకపోయారన్నారు. 14 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉంటే, 7వేల కోట్లను తమ ప్రభుత్వం రాగానే చెల్లించిందన్నారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులను సైతం తప్పనిసరిగా చెల్లిస్తామని, నిర్మాణ సంస్థలు ఎటువంటి భయం లేకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

Pilli Subhash Chandra Bose: రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌తోనే ఉంటాను..
మరో వైపు దేవదుల ప్రాజెక్ట్ పనులు 15 ఏళ్లుగా నత్తనడకలో సాగాయి.3000 ఎకరాల భుసేకరణ. చేయాల్సి వుంది. దీన్ని నవంబర్ 15 లోపు కంప్లైంట్ చేసి.. పనులను వేగంగా పూర్తి చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఏదుర్కొంటున్న రైతులకు హామీ ఇచ్చిన మేరకు బూముల నష్టపరిహారం ఇస్తాము అని హామీ ఇచ్చారు గోదావరి పరివాహక ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులతో ..ఉమ్మడి వరంగల్ జిల్లా తోబాటు. నల్గొండ .కమ్మం జిల్లాలకు పాక్షికంగా నీళ్లు అందుతాయి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక. దేవదుల ప్రాజెక్ట్ కి పెద్ద పీట వేయడం జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి. 15 ఏళ్లుగా నత్తనడకలో దేవదుల ప్రాజెక్ట్ సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. 3 లక్షల ఆయకట్టుకు 2026 సంవత్సరా లో ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్ట్ ఇన్ డెప్త్‌గా పరిశీలన చేయడం జరిగిందన్నారు. 3000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు.

మంత్రుల పర్యటనలో పాల్గొన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కీలక సూచనలు మంత్రి ఉత్తమ దృష్టికి తీసుకెళ్లారు వారందరూ సూచనలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. అతి త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐదున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. భూముల ధరలు పెరగడంతో భూ సేకరణ ఇబ్బందిగా మారిందని రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ కోసం ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నామన్నారు. సమ్మక్క బ్యారేజ్ ఎన్ఓసి కోసం చత్తీస్గడ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి త్వరలోనే సి డబ్ల్యూ సి నుండి అనుమతులు తెచ్చుకుంటామన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ తెలంగాణ గ్రామీణ ముఖచిత్ర మార్చడమే లక్ష్యంగా ప్రాజెక్టును గురి చేసే విధంగా ముందుకెళ్తామన్నారు.