సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. నిన్న భట్టి విక్రమార్క అస్వస్థతకు గురికావడం పాదయాత్రకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. అయితే.. ఇటీవల మాజీ బీఆర్‌ఎస్ నేత, ఖమ్మం మాజీ పార్లమెంటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ వార్తలు వస్తున్న వేళ.. అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్కను నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లిలో పాదయాత్ర శిబిరంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు.
Also Read : Health: చన్నీళ్ల స్నానంతో మేలే ఎక్కువ
అయితే.. వడదెబ్బ కారణంగా రెండు రోజులుగా అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్క ను పరామర్శించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భట్టి విక్రమార్క ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అస్వస్థత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయ సమీకరణలపై ఇద్దరి మధ్య ఏకాంతంగా చర్చలు సాగాయి. ఖమ్మంలో జరగబోయే పాదయాత్ర ముగింపు సభ, పార్టీలో చేరికల అంశంపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లి.. పార్టీలోకి చేరాలని అప్పీల్ చేశారు. ఈ క్రమంలో ఇవాళ భట్టి తో పొంగులేటి భేటీతో ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : Lemon For Diabetes: డయాబెటిక్ పేషెంట్లకు నిమ్మరసం ఎంతో మేలు.. ఐదు రకాలుగా తీసుకోవచ్చు!
అయితే.. నిన్న నల్గొండ జిల్లా కేతేపల్లిలో భట్టి చేపట్టిన పాదయాత్ర పీపుల్స్ మార్చ్కొనసాగతున్న.. క్రమంలో మోకాలినొప్పులు, జ్వరం కారణంగా సాయంత్రం వరకు చేయాల్సిన పాదయాత్రను వైద్యుల సూచన మేరకు నిలిపేశారు. సూర్యాపేట నుంచి వచ్చిన వైద్యులు నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్య చికిత్సలు అందించారు. వడదెబ్బ కారణంగా హైఫీవర్ ఉందని వారు తెలిపారు.