NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy: మాటల గారడీలతో కేసీఆర్ ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు

Ponguleti

Ponguleti

మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం ఉన్నదని అధికారులను అడ్డం పెట్టుకొని సభని ఆత్మీయ సమ్మేళనంను కట్టడి చేయటానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. జనాలని రాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని, జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నామన్నారు. నేను ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోలేదని, నేను చేసినది చెప్తానన్నారు. మాటల గారడీలతో కేసీఆర్ ప్రజల్ని ఆకట్టుకుంటున్నారని, మరోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ అనేక కుట్రలకి పాల్పడుతున్నాడని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడో ఒకచోట కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని ప్రచారానికి ఉపయోగించుకుంటారు.

Also Read : Brahmanandam: ఘనంగా బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థం

ఇల్లు కట్టుకోవటానికి మూడు లక్షలు ఇస్తామన్న హామీ మాయమాటలే. కేసీఆర్ మాటలని ఎవరు నమ్మొద్దు. యువతని నీ కేబినెట్లో ఉన్న మంత్రులు ఆడుకుంటున్నారు. వేల కోట్లు అక్రమంగా సంపాదించడం కోసం హైదరాబాదులో భూములు కొల్లగొట్టడం కోసం ధరణి స్కీం ని కేసీఆర్ అమలు చేస్తున్నారు. రైతుల సమస్యలు ప్రజల సమస్యలు కేసీఆర్ కి కనిపించవు. ప్రజల అండతో కేసీఆర్ దింపెస్తం. ఖమ్మం చుట్టూ ఉన్న మట్టి కుండలను కూడా మంత్రి అనుచరులు ఉంటున్నారు. ఖాళీ ప్లాట్లు కనపడితే మంత్రి అనుచరులు కబ్జా చేస్తున్నారు. మంత్రి తన అనుచరులను ఉసి కొల్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాజ్యం ఎప్పుడూ మీ చేతుల్లో ఉండదు. ఎంత మంచి పుడింగు అయిన ప్రజల ముందు తలవంచక తప్పదు. పట పంచలు అయ్యే రోజులు దగ్గరలోనే వున్నారు. మంత్రి గారు నిన్న ఇంటికి పంపడానికి ఎంత పెద్ద నాయకులు ఎవరు అవసరం లేదు. ప్రజలు సమయం కోసం ఎదురుచూస్తున్నారు అధికారం ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు.’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు.

Also Read : Pawan Kalyan: మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి.. ఎమోషనల్ అయిన మెగా బ్రదర్స్