దానిమ్మ పండు లో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ఫైబర్ అధికంగా ఉండటంతో చాలా మంది దానిమ్మ ను డైట్ లో చేర్చుకుంటారు.. ఆరోగ్యాన్నికి ఈ పండు చాలా మంచిది.. అందుకే డాక్టర్లు వీటిని ఎక్కువగా తీసుకోవాలని చూసిస్తారు.. ముఖ్యంగా సమ్మర్ వీటిని తీసుకోవడం మంచిది.. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందాన్ని పెంచడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.. దానిమ్మతో ఫేస్ ఫ్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ దానిమ్మ పండు స్కిన్‌కి చేసే మేలు కూడా ఎక్కువే. ఈ పండు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ముడతలు రాకుండా చూస్తుంది. చర్మం మీద ఉండే మచ్చలని పోగొడుతుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పండు తో మృదువైన, అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.. దానిమ్మతో ఇప్పుడు చెప్పబోయ్యే పేస్ ఫ్యాక్ తయారు చేసుకొని వేసుకుంటే దగదగా మెరిసే చర్మం మీ సొంతం.. ఈ ఫ్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలంటే..
దానిమ్మ గింజలను కాస్త స్క్రబ్ లాగా పేస్ట్ చేసుకోవాలి.. దానికి కొంచెం రోజ్ వాటర్ ను యాడ్ చెయ్యాలి.. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేసుకుంటే అందమైన మెరిసే చర్మం మీ సొంతం.. అలాగే దానిమ్మ రసంలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ వేసి ముఖం మీద అప్లై చేయండి. ఈ రసం ఎక్కువగా రాస్తే ముఖం ముఖం పీక్కుపోయినట్లు కనిపిస్తుంది.. గమినించి అప్లై చేసుకోవడం మంచిది.. అలాగే దానిమ్మ రసాన్ని ముఖానికి అప్లై చేసిన మంచి ఫలితం ఉంటుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.