NTV Telugu Site icon

Telangana Elections2023: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్..

New Project (3)

New Project (3)

Telangana Elections2023: మావోయిస్టు ప్రాబల్యం ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే 4 గంటల్లోపు పోలింగ్ కేంద్రంలో ఓటేయడానికి ఉన్న ప్రజలకు మాత్రం అవకాశం ఉంటుంది. 4 గంటల తర్వాత వచ్చే వారిని అధికారులు అనుమతించరు..

Read Also: NTR: మీరు ఓట్లు వేయరా.. రిపోర్టర్స్ కు సెటైర్ వేసిన ఎన్టీఆర్

సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం వంటి నియోజకవర్గాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఆనుకుని ఉన్నాయి. ఈ 13 నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రాబల్యం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ 4 గంటల వరకే పోలింగ్‌కి అనుమతించింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గాలన్నీ ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. ఇవి తప్పా.. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న గడ్చిరోలి, బీజాపూర్, దంతెవాడ, జగ్దల్పూర్ వంటి జిల్లాల్లో కూడా ఇదే విధంగా 4 గంటల వరకే ఓటేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ప్రస్తుతం తెలంగాణలో ఈ 13 నియోజకవర్గాలు కూడా ఈ జిల్లాల సరిహద్దుల్లోనే ఉన్నాయి.