NTV Telugu Site icon

Election Results: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్

Gujarat, Himachal Election Results

Gujarat, Himachal Election Results

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. గుజరాత్ లోని మొత్తం 182 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆప్ పార్టీల్లో ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం గుజరాత్ లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని అంచానా వేయగా.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోరు ఉంటుందని.. అయితే బీజేపీ మరోసారి మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికారం చేపడుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ కానుంది. 11 గంటల వరకు ట్రెండ్స్ తెలియనున్నాయి.

గుజరాత్ రాష్ట్రంలో అధికారం సాధించాలంటే ఏ పార్టీకైనా 92 స్థానాల మార్క్ దాటాలి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 35 స్థానాలు సాధించాల్సి ఉంటుంది.

The liveblog has ended.
  • 08 Dec 2022 05:27 PM (IST)

    హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్ 40, బీజేపీ 25

    హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ 35 స్థానాలను గెలుచుకుంది, 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 18 స్థానాల్లో గెలుపొందగా, కౌంటింగ్ కొనసాగుతున్నందున ప్రస్తుతం 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

     

  • 08 Dec 2022 04:52 PM (IST)

    ఆమ్‌ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గాధ్వీ పరాజయం

    గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ గాధ్వీ ఓటమి పాలయ్యారు. ఖంభాలియా నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి హర్దాస్‌భాయ్‌ బేరాపై 18వేల ఓట్ల తేడాతో పరాజయాన్ని చవిచూశారు.

  • 08 Dec 2022 04:48 PM (IST)

    గుజరాత్‌ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి రాజీనామా

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడడంతో కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రఘుశర్మ రాజీనామా చేశారు. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట కోత వెనుక ఆప్‌, అసదుద్దీన్ ఒవైసీ ఓ కారణమన్నది నిజమని గుజరాత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ జే ఠాకూర్‌ పేర్కొన్నారు. తమ లోటుపాట్లను విశ్లేషించేందుకు త్వరలో సమావేశం కానున్నట్లు తెలిపారు.

  • 08 Dec 2022 04:45 PM (IST)

    రాజీనామాను గవర్నర్‌కు అందజేసిన జైరాం ఠాకూర్‌

    రాజీనామాను గవర్నర్‌కి అందజేసినట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్ వెల్లడించారు. ప్రజల అభివృద్ధికి కృషి చేయడం ఎప్పటికీ ఆగదన్నారు. ఫలితాలపై చర్చించేందుకు అధిష్ఠానం పిలిస్తే ఢిల్లీకి వెళ్తానని ఆయన తెలిపారు.

     

  • 08 Dec 2022 03:23 PM (IST)

    గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపిన జైరాం ఠాకూర్‌

    హిమాచల్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. గత ఐదేళ్లలో తనకు సహకరించిన ప్రధాని మోడీకి, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడతామని ఆయన స్పష్టం చేశారు.

  • 08 Dec 2022 02:44 PM (IST)

    భారీ ఆధిక్యంలో రివాబా జడేజా.. భర్త రవీంద్ర జడేజాతో కలిసి రోడ్‌ షో

    గుజరాత్‌లో జామ్‌నగర్ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థి రివాబా జడేజా తన భర్త, క్రికెటర్ రవీంద్ర జడేజాతో కలిసి జామ్‌నగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఆమె ఆప్ అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్మూర్‌పై 50,456 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

     

  • 08 Dec 2022 01:12 PM (IST)

    భారీ విజయం దిశగా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. బీజేపీ తరుపున జామ్ నాగర్ నార్త్ నుంచి పోటీ చేసిన ఆమె 30వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 08 Dec 2022 11:44 AM (IST)

    హిమాచల్ లో విజయం దిశగా కాంగ్రెస్..

    హిమాచల్ ప్రదేశ్ లో విజయం దిశగా కాంగ్రెస్ వెళ్తోంది. ఇప్పటికే మెజారిటీ మార్క్ దాటింది. 68 స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో 35 మ్యాజిక్ ఫిగర్ కాగా.. కాంగ్రెస్ 40 స్థానాల్లో, బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి.

  • 08 Dec 2022 11:15 AM (IST)

    స్వతంత్రులతో బీజేపీ మంతనాలు..

    హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. ప్రస్తుతం నాలుగు చోట్ల స్వతంత్రులు ఆధిక్యంలో ఉన్నారు. అయితే వీరు ఎవరికి మద్దతు ఇస్తే వారే.. అధికారం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ స్వతంత్రులతో మంతనాలు సాగిస్తోంది.

  • 08 Dec 2022 11:08 AM (IST)

    హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్ ఘన విజయం..

    బీజేపీ సీఎం అభ్యర్థి జైరాం ఠాకూర్ సరాజ్ స్థానం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 20,000 మెజారిటీతో ఆయన విజయం సాధించారు.

  • 08 Dec 2022 11:05 AM (IST)

    హిమాచల్ లో కీలకం కానున్న ఇండిపెండెంట్లు...

    హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తోంది. స్వల్పంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. అయితే అధికారం ఏర్పాటులో ఇక్కడ స్వతంత్రులు కీలకం కానున్నారు. నలుగురు స్వతంత్రులు లీడింగ్ లో ఉన్నారు. ఇందులో ముగ్గురు బీజేపీ రెబల్స్ కాగా.. ఒకరు కాంగ్రెస్ పార్టీ రెబెల్.

  • 08 Dec 2022 10:31 AM (IST)

    హిమాచల్ లో క్యాంప్ రాజకీయం..

    హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఈసారి ఏ పార్టీకి కూడా స్పష్టంమైన ఆధిక్యత ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం 68 స్థానాల్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యతతో 33 స్థానాల్లో, బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలను చేసే అవకాశం ఉంది.

  • 08 Dec 2022 10:29 AM (IST)

    150 స్థానాలు క్రాస్ చేసిన బీజేపీ..

    గుజరాత్ లో భారీ విజయం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. 182 స్థానాల్లో 155 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 17, ఆప్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  • 08 Dec 2022 10:06 AM (IST)

    మోర్బీలో బీజేపీ లీడింగ్..

    గుజరాత్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మోర్బీలో బ్రిడ్జ్ కూలి 130 మందికి పైగా ప్రజలు చనిపోయారు. అలాంటి మోర్బీ స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

  • 08 Dec 2022 09:53 AM (IST)

    గుజరాత్ లో బీజేపీ ప్రభంజనం..హిమాచల్ లో హోరాహోరీ

    గుజరాత్‌లో 149 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం.. 2017 కంటే గుజరాత్‌లో బీజేపీకి సీట్లు పెరిగే అవకాశం.. హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ.. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపని ఆమ్‌ఆద్మీ పార్టీ

  • 08 Dec 2022 09:12 AM (IST)

    హిమాచల్ లో నువ్వా నేనా..

    హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. క్షణక్షణానికి ఆధిపత్యాలు మారుతున్నాయి. బీజేపీ 36 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  • 08 Dec 2022 09:04 AM (IST)

    గుజరాత్ లో బీజేపీ ముందంజ..

    గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 182 స్థానాల్లో 130 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 48 స్థానాల్లో, ఆప్ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

  • 08 Dec 2022 08:35 AM (IST)

    లీడింగ్ లో జైరాంఠాకూర్..

    హిమాచల్ ప్రదేశ్ సీఎం, బీజేపీ అభ్యర్థి జైరాం ఠాకూర్ సెరాజ్ నియోజకవర్గంలో లీడింగ్ లో ఉన్నారు.

  • 08 Dec 2022 08:29 AM (IST)

    లీడింగ్ లో రవీంద్ర జడేజా భార్య

    జామ్ నగర్ నార్త్ నుంచి పోటీ చేస్తున్న స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ముందంజలో ఉన్నారు. బీజేపీ తరుపున రివాబా పోటీ చేశారు.

  • 08 Dec 2022 08:28 AM (IST)

    గుజరాత్ లో ముందంజలో ఉన్నది వీరే

    బీజేపీ నుంచి గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్, బీజేపీ నేతలు అల్పేష్ ఠాకూర్, హర్దిక్ పటేల్ లీడింగ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జిగ్నేష్ మేవానీ, ఆప్ నుంచి ఇసుదిన్ గధ్వీ ముందంజలో ఉన్నారు.

  • 08 Dec 2022 08:19 AM (IST)

    హిమాచల్ ప్రదేశ్ లో హోరాహోరీ

    హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ.. 15 స్థానాల్లో బీజేపీ, 8 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి.

  • 08 Dec 2022 08:17 AM (IST)

    బీజేపీ దూకుడు

    గుజరాత్ లో దూసుకుపోతున్న బీజేపీ మొత్తం 182 స్థానాల్లో 47 స్థానాల్లో ఆధిక్యం. కాంగ్రెస్ 15 స్థానాల్లో, ఆప్ ఒక స్థానంలో లీడింగ్ లో ఉన్నాయి.

  • 08 Dec 2022 08:06 AM (IST)

    ప్రారంభమైన కౌంటింగ్..

    గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. 11 గంటల వరకు ఫలితాలపై స్పష్టత రానుంది.