Maharani 3 : ఓటీటీలోకి వచ్చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్..ఆకట్టుకుంటున్న ట్రైలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో మహారాణి వెబ్ సిరీస్ ఒకటి. బీహార్ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ తొలి రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.1990 ల నాటి బీహార్ రాజకీయాలను కళ్లకు కడుతున్న ఈ సిరీస్ మూడో సీజన్ మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 19) రాత్రి ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది.బీహార్ రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయో ఈ మహారాణి వెబ్ సిరీస్ తొలి రెండు సీజన్లతోనే చూపించింది. ఈ మూడో సీజన్లో ఈ పొలిటికల్ వార్ మరింత తీవ్రం కానున్నట్లు తెలుస్తుంది.. రెండో సీజన్ చివర్లో జైలుకి వెళ్లే రాణీ భారతి.. తిరిగి కొత్త బీహార్ లో అడుగు పెట్టి మళ్లీ కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకుంటుందా లేదా అన్నది మూడో సీజన్ లో చూపించనున్నారు.
రాణీ భారతి పాత్ర లో అదరగొట్టిన బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఇప్పుడు మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.ట్రైలర్ చూస్తేనే మహారాణి మూడో సీజన్ ఎంత ఇంటెన్సివ్ గా ఉండబోతోందో అర్ధం అవుతుంది.ఆగస్ట్, 2022 లో రెండో సీజన్ రాగా ఏడాదిన్నర తర్వాత మూడో సీజన్ తో మహారాణి రాబోతోంది. దీంతో ఈ సిరీస్ పై ఎంతో ఆసక్తి నెలకొంది.ఈ మహారాణి వెబ్ సిరీస్ ను సుభాష్ కపూర్ క్రియేట్ చేయగా సౌరభ్ భావే డైరెక్ట్ చేశాడు. నందన్ సింగ్ మరియు ఉమాశంకర్ సింగ్ లతో కలిసి సుభాష్ కపూర్ ఈ సిరీస్ కు కథ ను అందించాడు. మహారాణి మూడో సీజన్ మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కి రానుంది.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!