NTV Telugu Site icon

Telangana: తెలంగాణలో పంపకాలు షూరు..

Political Parties

Political Parties

పోలింగ్ కు మరో ఐదు రోజులే సమయం ఉండటంతో.. ఓట్ల కోసం నోట్ల పంపిణీ స్టార్ట్ అయింది. తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల పొలిటికల్ పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి. ఇక, ఖమ్మం జిల్లాలో హోరాహోరీగా పోరు జరుగుతున్న పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో ఒక ప్రధాన పార్టీ అభ్యర్థులు నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఒక నియోజకవర్గంలో అయితే రాత్రికిరాత్రే పంపకాలు పూర్తైనట్లు తెలుస్తుంది. ఇక, ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక చోట ఓటుకు రూ.3 వేలు ఇస్తే, మరోచోట రూ.2 వేల చొప్పున పంచారట. ఇటు హైదరాబాద్‌లోనూ కొన్ని నియోజకవర్గాల్లో డబ్బుల పంపకాలు ప్రారంభమయ్యాయి. శేరిలింగంపల్లిలో ఓ పార్టీ నేత ఓటుకు రూ.3వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అటు వరంగల్‌ జిల్లాలోనూ భూపాలపల్లి, మహబూబాబాద్‌, పాలకుర్తి, వర్దన్నపేట నియోజకవర్గాల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.2 వేల దాకా డబ్బులు ఇస్తున్నారు.

Read Also: Vande Bharat: వందేభారత్‌ పై మరోసారి రాళ్ల దాడి..

ఇక, గ్రామీణ ప్రాంతాల్లో డబ్బుల పంపకాలు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. అధికారులు ఒకవైపు తనిఖీలు చేస్తున్నప్పటికి.. మరోవైపు డబ్బును ఒకే చోట నిల్వ చేయడం సురక్షితం కాదని ఎమ్మెల్యే అభ్యర్థులు అనుకుంటున్నారు.. డబ్బు పంపకాల వ్యవహారాన్ని చివరి రోజు రాత్రి వరకూ పెట్టుకుని టెన్షన్‌ పడడం కంటే ముందుగానే పంచేస్తే మంచిదనే అభిప్రాయంతో చాలామంది పంపకాలు చేస్తున్నారు. అయితే, డబ్బు పంపిణీలో ఒక్కో పార్టీది ఒక్కో విధానం అవలంభిస్తున్నారు. ఇప్పటికే, బీఆర్‌ఎస్‌ పార్టీ తన అభ్యర్థులకు భారీగానే ఫండింగ్‌ చేసింది. ఒక విడత నిధులను అభ్యర్థులకు ఇచ్చేసింది. ఇప్పుడు మిగతా నిధుల సర్దుబాటు కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ చక్కబెట్టేస్తున్నట్టు టాక్.

Read Also: America Gunfire: అమెరికాలో దారుణం.. పీహెచ్ డీ చేస్తున్న 26 ఏళ్ల భారతీయ విద్యార్థి హత్య

అయితే, కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఇప్పటి వరకు పై నుంచి నిధులు వచ్చింది తక్కువే.. ప్రస్తుతానికి ఆ పార్టీ అభ్యర్థులు తమ సొంత డబ్బునే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ పార్టీ సగానికి పైగా నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇచ్చింది. మిగతా నియోజకవర్గాలకు పార్టీ నుంచి ఫండింగ్‌ వెళ్తుంది. కర్ణాటక నుంచి కొంత, పార్టీలోనే ఆర్థికంగా బలమైన నేతల నుంచి కొంత మేర నిధులను సర్దుబాటు చేస్తున్నారు. మరో వైపు, ఖర్చు విషయంలో వెనుకంజలో ఉండే కమలం పార్టీ.. ఈసారి కొన్ని ఎంపిక చేసిన స్థానాల్లో భారీగా ఖర్చు చేసేందుకు రెడీ అయింది. ఆ పార్టీ బలంగా ఉన్న చోట్ల నిధులను సర్దుబాటు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Read Also: Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

కాగా, అత్యధిక స్థానాల్లో ఓటర్లకు పంచాల్సిన డబ్బును క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు అభ్యర్థులు కసరత్తు చేసే పనిలో ఉన్నారు. కొందరు ఇప్పటికే గ్రామాల వరకు డబ్బును తీసుకెళ్లి పార్టీ నేతలకు అందజేస్తున్నారు.. మిగతా వారు పంపిణీకి అవసరమైన డబ్బు కోసం ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పంపిణీ స్టార్ట్ చేయని మిగతా జిల్లాల్లోనూ రెండు.. మూడు రోజుల్లోనే ఆరంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గ్రామాల్లో, వార్డులు, బస్తీల్లో ఇలా వేర్వేరు ప్రాంతాల్లో డబ్బు పంపిణీకి అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. డబ్బు పంపిణీలో అభ్యర్థుల విజయావకాశాలు, ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీలూ సర్వేల ఆధారంగా తాము బలహీనంగా ఉన్న చోట్లే పంపకాలు చేపట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది.