NTV Telugu Site icon

Narendra Modi: నరేంద్ర మోడీ రాజకీయ వారసుడు అతనే?

Modi

Modi

Narendra Modi Political Heir: బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవు. కాషాయ పార్టీ కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ఈ పార్టీకి సంబంధించినంత వరకు నా తరువాత నా కొడుకు సీఎం, పీఎం అనే కాన్సెప్ట్ లు ఉండవు.  కుటుంబ రాజకీయాలు చేస్తాయని  తరుచూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నేతగా ప్రధాని మోడీ నిలిచారు. ఇప్పటికే తనకున్న చరిష్మాతో రెండు సార్లు కాషాయ పార్టీని ఎవరు ఊహించని విధంగా అత్యధిక లోక్ సభ స్థానాలు తీసుకువచ్చి అధికారంలో నిలిపారు. అత్యంత శక్తిమంతమైన పార్టీగా బీజేపీని నిలిపారు మోడీ. ఒకటి కాదు రెండు కాదు మోడీ గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఒక్కసారి ఆయన మాట్లాడం వింటే ఎవరైనా సైలెంట్ గా వినాల్సిందే.  బీజేపీలోఆయనే మోస్ట్ పవర్ ఫుల్ లీడర్. ఎతంటి పెద్ద నిర్ణయమైనా మోడీ తీసుకోగలరు అంతేకాకుండా దానిని గట్టిగా అమలు చేస్తారు కూడా. డీమోనిటైజేషన్, సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఎన్నో పెద్ద నిర్ణయాలను తీసుకొని ఇప్పటి వరకు ఎవరు సాహసం చేయని వాటిని కూడా మోడీ చేసి చూపించారు.

Also Read: Guinness World Record : ఇదో వింత స్టోరీ.. నిద్రలో నడుస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన బాలుడు

అయితే ఇంత స్ట్రాంగ్ లీడర్ అయిన మోడీ వారసుడు ఎవరు అనే చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. మోడీ తరువాత బీజేపీలో ఎవరు ప్రధానిగా ఉండాలి అని ప్రశ్న కొనసాగుతుంది. సూటిగా చెప్పుకోవాలి అంటే మోడీ వారసుడు ఎవరు? అనే అంశంపై చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించే  ఇండియా టుడే – సీ ఓటర్ సంస్థలు ఓ సర్వే నిర్వహించారు. అయితే అందులో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారసుడిగా అమిత్ షా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే చూస్తే అర్థం అవుతుంది. అమిత్ షా వారసుడిగా ఉండాలని 29 శాతం మంది ఓటు వేశారు. ఇక ఈ వారసుడి రేసులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు. యోగికి 26 శాతం మంది, గడ్కరీకి 15 శాతం మంది మోడీ రాజకీయ వారసుడిగా తమ మద్దతు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే మోడీ తరువాత అమిత్ షా వారసుడు కావాలని ఎక్కువ మంది భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.