NTV Telugu Site icon

Udayagiri Politics: ఉదయగిరిలో ఉద్రిక్త పరిస్థితులు.. రసవత్తరంగా రాజకీయాలు

Ysrcp

Ysrcp

Udayagiri Politics: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. నేతలు, వైసీపీ బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో జిల్లాలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. తను తరిమేస్తానన్న వైసీపీ నేతలు రావాలంటూ.. ఉదయగిరి బస్టాండ్ వద్ద మేకపాటి బైఠాయించడంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్జాయి. గురువారం సాయంత్రం ఉదయగిరిలోని బస్టాండ్‌ సమీపంలోని రోడ్డు మీదకు అభిమానులతో వచ్చి రోడ్డుపై కుర్చీలో కూర్చుని, తన వ్యతిరేక వర్గ నేతలకు మేకపాటి ప్రతిసవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. ఉదయగిరికి వస్తే తరుముతామన్న వాళ్లు రావాలంటూ.. మేకపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

ఇదిలా ఉండగా.. దమ్ముంటే ఉదయగిరికి రావాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ రెడ్డిని సవాల్‌ చేసిన వైసీపీ నేతలు ఇవాళ బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున సెంటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఉదయగిరి వైసీపీ నేత భాస్కర్ రెడ్డి బస్టాండ్ సెంటర్ వచ్చి దమ్ముంటే శేఖర్ రెడ్డి ఇక్కడికి రావాలని సవాల్ విసిరారు. మరో వైపు సుబ్బారెడ్డి కూడా తన అనుచరులతో బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే వర్గం కూడా బస్టాండ్ సెంటర్‌కు వస్తారననే సమాచారం రావడంతో మరింత మంది పోలీసులను రప్పిస్తున్నారు.

Read Also: JP Nadda: ఏపీ-తెలంగాణలో నూతన బీజేపీ ఆఫీస్‌.. వర్చువల్ ద్వారా ప్రారంభించనున్న జేపీ నడ్డా

అధికార వైసీపీకి బహిష్కృత నేతల నుంచి తలపోటు తగ్గడం లేదు. పార్టీలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయడానికి కాస్త ఆచితూచి వ్యవహరించిన వైసీపీ బహిష్కృత నేతలు పార్టీ నుంచి బయటికి వచ్చాకా విమర్శలకు పదును పెట్టారు. వారిపై కఠిన చర్యలు తీసుకుందామంటే ఇంతకాలం జరిగిన అంతర్గత అంశాలను సైతం బహిరంగ పరుస్తూ… అధికార పార్టీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా రాజకీయ పరిణామాలను తయారు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సైతం తాను వైసీపీ నేతలు చేసే దందాలకు అడ్డు వస్తాననే తనపై ఆరోపణలు చేశారని వెల్లడించింది. ఇక కోటం రెడ్డి మరో రెండు అడుగులు ముందుకేసి.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీని శాశ్వతంగా బహిష్కరిస్తారని… ఎన్నికల్లో రాజకీయంగా సునామీ రాబోతుందని ప్రకటిస్తున్నారు.

Show comments