సామాజిక మాధ్యమాల్లో ప్రజాప్రతినిధుల మార్ఫింగ్ చిత్రాల కేసును విచారిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ వార్ రూంపై దాడి చేసి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా మరోసారి మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ గళం వెబ్ పేజీలో అనుచిత పోస్టింగ్స్ చేశారంటూ మహేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సీఆర్పీసీ 41ఏ కింద మల్లు రవికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. శనివారం గాంధీ భవన్‌కు వెళ్లి పోలీసులు మల్లురవికి నోటీసులు అందజేశారు. కాగా, సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితతో పాటు ప్రభుత్వంపై అనుచిత రీతిలో సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తున్నారంటూ మల్లు రవిని గత నెలలో సీఆర్పీసీ 41 నోటీసుల కింద సైబర్ క్రైమ్ పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.
Also Read : Pakistan: కుడి చేతిలో ఖురాన్..ఎడమ చేతిలో అణుబాంబు.. ఆర్థిక సంక్షోభానికి పాక్ నాయకుడి పరిష్కారం
అయితే.. గత విచారణ సమయంలో కాంగ్రెస్ వార్ రూమ్‌కు తానే ఇన్‌ఛార్జిగా ఉన్నానని, కించపరిచే ఉద్దేశంతో తాము ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదని మల్లు రవి విచారణలో తెలిపారు. సామాన్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నామన్నారు. సునీల్ కనుగోలు విషయమై కూడా తనను ప్రశ్నించారన్నారు. సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ వార్ రూమ్‌తో సంబంధం లేదని చెప్పానన్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలిస్తే రావాలని పోలీసులు చెప్పారన్నారు మల్లు రవి. అయితే.. ఇప్పుడు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Also Read : R.V. Gurupadam: దక్షిణాది చిత్రసీమలో మరో విషాదం!
