Drugs: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు యువకులు అమ్ముతున్నారు.. అను ఇంజనీరింగ్ కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీ-ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అశోక్ కుమార్ తో పాటు మరో మైనర్ అరెస్టు చేశారు. స్టూడెంటైన అశోక్ కుమార్, డ్రగ్స్ కు బానిసగా మారాడు.. ఆ తరువాత డ్రగ్స్ సేవిస్తూనే సరఫరాదారుడిగా మారాడు అని పోలీసులు పేర్కొన్నారు. అశోక్ కుమార్ తో పాటు అరెస్టైన మైనర్ కూడా డ్రగ్స్ పెడ్లర్ గా గుర్తించారు. వీరిద్దరూ రాజస్థాన్ ప్రాంతానికి చెందిన వారు అని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు.
Read Also: Flipkart Sale 2024: ఫ్లిప్‌కార్ట్‌లో ‘రిపబ్లిక్ డే’ సేల్.. ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు!
Also Read
- Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
అయితే, అశోక్ కుమార్ కుటుంబం హైదరాబాద్ కు వలస వచ్చింది అని సీపీ సుధీర్ బాబు చెప్పారు. లంగర్‌హౌజ్‌లో నివాసం ఉంటున్నారు.. రాజస్థాన్ లో హెరాయిన్ డ్రగ్ ను గ్రాముకు ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేసి నగరానికి తీసుకువస్తున్న ఇద్దరు.. నగరంలో గ్రాము పది వేల నుంచి పన్నెండు వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.. పక్కా సమాచారంతో హయత్‌నగర్ లో అశోక్ తో పాటు మైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 50 లక్షల రూపాయల విలువైన 80 గ్రాముల హెరాయిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Mukesh Ambani: 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
ఇక, అశోక్ తో పాటు మరో మైనర్ మొదటిసారి పట్టుబడ్డారు అని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. లారీ డ్రైవర్లకు, స్టూడెంట్స్ కి విక్రయిస్తున్నారు.. గతంలో రెండు సార్లు రాజస్థాన్ నుండి తీసుకు వచ్చారు.. నిందితులకు కఠినంగా శిక్ష పడేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను పకడ్భందిగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే సమాచారం అందించండి.. ఈ కేసులో పదేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే, సరఫరాదారులుగా మారుతున్నారు.. ఇలా డ్రగ్స్ వినియోగాన్ని విస్తరిస్తున్నారు అని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Huawei MateBook Pro S: హువావే మేట్‌బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్‌టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!