NTV Telugu Site icon

Drugs: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

Drugs

Drugs

రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు యువకులు అమ్ముతున్నారు.. అను ఇంజనీరింగ్ కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీ-ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అశోక్ కుమార్ తో పాటు మరో మైనర్ అరెస్టు చేశారు. స్టూడెంటైన అశోక్ కుమార్, డ్రగ్స్ కు బానిసగా మారాడు.. ఆ తరువాత డ్రగ్స్ సేవిస్తూనే సరఫరాదారుడిగా మారాడు అని పోలీసులు పేర్కొన్నారు. అశోక్ కుమార్ తో పాటు అరెస్టైన మైనర్ కూడా డ్రగ్స్ పెడ్లర్ గా గుర్తించారు. వీరిద్దరూ రాజస్థాన్ ప్రాంతానికి చెందిన వారు అని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు.

Read Also: Flipkart Sale 2024: ఫ్లిప్‌కార్ట్‌లో ‘రిపబ్లిక్‌ డే’ సేల్‌.. ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు!

అయితే, అశోక్ కుమార్ కుటుంబం హైదరాబాద్ కు వలస వచ్చింది అని సీపీ సుధీర్ బాబు చెప్పారు. లంగర్‌హౌజ్‌లో నివాసం ఉంటున్నారు.. రాజస్థాన్ లో హెరాయిన్ డ్రగ్ ను గ్రాముకు ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేసి నగరానికి తీసుకువస్తున్న ఇద్దరు.. నగరంలో గ్రాము పది వేల నుంచి పన్నెండు వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.. పక్కా సమాచారంతో హయత్‌నగర్ లో అశోక్ తో పాటు మైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 50 లక్షల రూపాయల విలువైన 80 గ్రాముల హెరాయిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Mukesh Ambani: 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్

ఇక, అశోక్ తో పాటు మరో మైనర్‌ మొదటిసారి పట్టుబడ్డారు అని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. లారీ డ్రైవర్లకు, స్టూడెంట్స్ కి విక్రయిస్తున్నారు.. గతంలో రెండు సార్లు రాజస్థాన్ నుండి తీసుకు వచ్చారు.. నిందితులకు కఠినంగా శిక్ష పడేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను పకడ్భందిగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే సమాచారం అందించండి.. ఈ కేసులో పదేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే, సరఫరాదారులుగా మారుతున్నారు.. ఇలా డ్రగ్స్ వినియోగాన్ని విస్తరిస్తున్నారు అని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.