NTV Telugu Site icon

Miryalaguda: మిర్యాలగూడలో భారీగా బంగారం పట్టివేత..

Delhi Gold

Delhi Gold

నల్గొండ జిల్లా మిర్యాల గూడలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో.. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. మిర్యాలగూడ టౌన్‌ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు విలువ చేసే 13 కిలోల బంగారం పట్టుకున్నారు. బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.. కాగా.. బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ డిస్టిబూటర్లకు సరాఫరా చేసే ఓ ఏజెన్సీకి చెందిన వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. అటు దేశ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బులు భారీగా చేతులు మారుతాయని ఊహించిన పోలీస్ శాఖ.. రాత్రి పగలు అనకుండా చెకింగ్ నిర్వహిస్తున్నారు.