NTV Telugu Site icon

Police Saved Life : శభాష్‌.. ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన పోలీసులు..

Saved Life

Saved Life

కొందరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఎంతో బాధకు గురిచేస్తాయి. అయితే.. ఇబ్బందులు తాళలేక ఎంతో మంది తనువు చాలించినవారు ఉన్నారు.. కానీ.. వారినే నమ్ముకున్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అయితే.. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోతుంటే పోలీసులు రక్షించి ప్రాణదానం చేశారు. ఈ ఘటన నల్లగొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమ కుటుంబ సభ్యులతో ఏర్పడిన భూ వివాదాల కారణంగా ట్రైన్ కింద పడి ఆత్మహత్యా చేసుకోవడానికి యత్నించిన ఓ వ్యక్తిని నల్లగొండ టూ టౌన్ పోలీసులు రక్షించారు. నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ కు తన తండ్రి, సోదరిలతో భూ వివాదాలు ఉన్నాయి.
Also Read : Naseeruddin Chisti: ప్రధాని మోదీపై పాకిస్తాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. సూఫీ కౌన్సిల్ ఆగ్రహం

ఆ భూ వివాదాలు పరిష్కారం కాకపోవడంతో ఆత్మహత్యకు సిద్ధం అయ్యాడు.. తన ఆత్మహత్యకు భూ వివాదాలు, తన సోదరిని లు కారణమని తాను ట్రైన్ కింద పడి చనిపోవడానికి సిద్ధమయ్యానని సేల్ఫీ వీడియో తీసి గ్రామ వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేసాడు శ్రీనివాస్. వెంటనే గ్రామస్థులు ఈ సమాచారాన్ని నార్కట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరాం రెడ్డికి అందించారు.. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టు టౌన్ ఎస్ఐ, సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ కు, ఆయన కుటుంబ సభ్యులకు టూ టౌన్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.