NTV Telugu Site icon

Noida Police: మురికి కాలువలో పడిన యువకుడిని రక్షించిన పోలీసులు.. వీడియో వైరల్

New Project (25)

New Project (25)

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన పోలీసులు ఓ యువకుడి ప్రాణాలు కాపాడారు. మద్యం మత్తులో ఓ యువకుడు 30 అడుగుల లోతులో ఉన్న మురికి కాలువలో పడగా.. పోలీసులు అతడిని బయటకు తీశారు. అతడిని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని యూపీ పోలీసులు కూడా తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున డయల్ 112కి మత్తులో ఉన్న వ్యక్తి 30 అడుగుల పొడవైన డ్రెయిన్ పైపులో పడిపోయినట్లు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రెయిన్ పైపులో ఓ యువకుడి అరుస్తున్న శబ్ధాన్ని గుర్తించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదే సమయంలో స్థానిక ప్రజలు కూడా పోలీసులకు సహాయం చేయడం వీడియోలో కనిపిస్తుంది.

READ MORE: Tollywood: సెట్స్ మీదకెళ్ళి మూడేళ్లు.. ఇంకెప్పుడు ఈ సినిమాలకు మోక్షం?

స్థానికుల సహాయంతో పలువురు పోలీసు అధికారులు మురికి కాలువలోకి దిగి యువకుడికి బయటకు తీసేందుకు యత్నించారు. చివరకు అతడిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. లక్షల మంది ఈ వీడియోను చూశారు. పోలీసుల పనితీరును మెచ్చుకుంటున్నారు. చాలా మంది వీవర్స్ వారికి పొగుడుతూ..కామెంట్స్ పెడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సైతం ప్రశంసలు గుప్పించారు. ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ “పోలీసులు, స్థానిక ప్రజలు మంచి పని చేసారు” ఇలా రాసుకొచ్చారు. మరొకరు “పోలీసులకు సహాయం చేసిన స్థానిక ప్రజలే నిజమైన హీరోలు.” అని పోస్టు చేశారు.