Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
- అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
- రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్న పోలీసులు
- సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో నోటీసులు జారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతవారం సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్‌పై ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు రావాలని పోలీసులు నోటీసులు అందించిన నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
Read Also: Manchu Manoj: మంచు మనోజ్ ఫిర్యాదు కాపీలో సంచలన అంశాలు
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ను రేపు పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి 18మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇందులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. అనంతరం రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో నాలుగు వారాల బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం.
- Tags
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!