Site icon NTV Telugu

Sai Ganesh: పోస్టుమార్టం చేయకుండా కాలయాపన

Sai Ganesh

Sai Ganesh

తెలంగాణలో సంచలనం కలిగించిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆతహత్యాయత్నంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పోలీసుల తీరుపై మండిపడ్డారు. సాయి గణేష్ ఆత్మహత్య యత్నం చేసుకోవడం వెనుక కారణం అయినవారిని వెంటనే శిక్షించాలన్నారు. ఓ ఆటోలో పోలీసులు సాయి గణేష్‌ ని తీసుకువెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రి లో వదిలి వెళ్ళారని, సాయి గణేష్ ను మెరుగైన వైద్యం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారన్నారు.

పరిస్థితి విషమించటంతో హైదరాబాదు తరలించాం అన్నారు గల్లా సత్యనారాయణ. చికిత్స పొందుతూ సాయి గణేష్ మృతి చెందాడన్నారు. హైదరాబాదు నుండి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కి పొస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని తరలించాం. పోస్ట్ మార్టం చెయ్యకుండా పోలీసులు కాలయాపన చేశారన్నారు. మా కార్యకర్త చనిపోయి మేమంతా బాధలో ఉంటే మా పై అల్లరి‌ముకలు దాడి చేస్తే పోలీస్ శాఖ వారు పట్టనట్లు ఉన్నారు. పోలీసులు మమ్మల్ని నియంత్రించడం చేశారు కానీ అల్లరి ముకలను, రౌడీ షీటర్లను నియంత్రిచలేక పోయారన్నారు. సాయి గణేష్ కు కోవిడ్ ఉందని చెప్పినా కూడా కేసులు పెడుతూ వేధించారు.

టీఆర్.ఎ నేతలు, రౌడీలు, కత్తులు,కర్రలతో మాపై దాడి చేశారు. తాతా మధు మాట్లాడిన మాటాలు భేషరతుగా వెనక్కి తీసుకోవాలన్నారు గల్లా సత్యనారాయణ. సాయిగణేష్ అంతిమ యాత్రలో టీఆర్ఎస్ నాయకులు‌ కర్రలతో దాడి చేశారు. దిగజారుడు రాజకీయాలు మేము చేయడంలేదన్నారు. జిల్లా అధ్యక్షుడు అయిన నాతో పాటు అనేక మందిపై కేసులు పెట్టించారు.వీటిపై తాతా మదు స్పందించాలని డిమాండ్ చేశారు.

Read Also: Sai Ganesh Demise: బీజేపీ కార్యకర్త మృతి కేసులో కీలక సాక్ష్యం.. మంత్రి టార్చరే కారణం..!

Exit mobile version