NTV Telugu Site icon

Pakistan: ఉగ్రవాదుల భయంతో ఇళ్లలో దాక్కుంటున్న పాకిస్తానీ పోలీసులు..

Pak

Pak

పాకిస్థాన్ లో క్లిష్ట పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక వైపు తాలిబన్లతో యుద్ధ వాతావరణం నెలకొంది. దేశంలో నిరంతరం జరుగుతున్న ఉగ్రదాడుల కారణంగా ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల భయంతో పోలీసు అధికారులు సైతం ఇళ్లలోనే తలదాచుకునే పరిస్థితి ఏర్పాడింది. యూనిఫాం వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో దాదాపు 1200 మంది పోలీసు అధికారులు, సైనికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఉగ్రవాదుల భయం ఎంత స్థాయికి చేరిందో మనం అర్థం చేసుకోవచ్చు.. పోలీసు అధికారులు గస్తీకి కూడా వెళ్లేందుకు వెనుకాడుతున్నారు.. పోలీసు స్టేషన్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

Read Also: Delhi : స్కూటర్ పై తీసుకెళ్తుండగా రూ.3 కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు

ఇక, పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతంలో సుమారు 1200 మంది పోలీసులు రెండు రోజులుగా సమ్మెలో ఉన్నారు. లోయర్ సౌత్ వజీరిస్తాన్, టోయ్ ఖోలా, స్పెయిన్, తానై, షికాయ్, ఆజం వార్సక్, జగ్జాయ్‌లోని ఆరు పోలీస్ స్టేషన్లు.. వాటికి సంబంధించిన అధికారులు ఈ నిరవధిక సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు. దక్షిణ వజీరిస్థాన్‌లో సమ్మెలో ఉన్న పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రైవేట్ వాహనాలను ఉపయోగించినందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఆరోపణలపై పలువురు పోలీసు అధికారులు, ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. తమ చట్టపరమైన అధికారాలను వినియోగించుకోవడానికి కూడా అనుమతించడం లేదని వారు అంటున్నారు.

Read Also: India-Pakistan Relations: భారత్తో మెరుగైన సంబంధాల కోసం పాకిస్థాన్లో డిమాండ్..

అయితే, రాత్రిపూట తీవ్రవాద దాడుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రిపూట కూడా పెట్రోలింగ్‌ వెళ్లడం లేదు.. ఈ కారణంగానే చాలా మంది అధికారులు తమ వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ విధులు నిర్వహించేందుకు వినియోగిస్తున్నారని అంటున్నారు. వివిధ చెక్‌పోస్టుల వద్ద పారామిలటరీ బలగాలతో సంయుక్తంగా మోహరించడం మరో ప్రధాన సమస్య.. వారు ఈ చెక్‌పోస్టుల దగ్గర పోలీసుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.