Site icon NTV Telugu

Hyderabad: బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం.. నిందితుడు షార్ట్ ఫిలిం దర్శకుడిగా గుర్తింపు

Accident

Accident

బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన షార్ట్ ఫిలిం దర్శకుడుగా గుర్తించారు. ప్రమాదం తరువాత.. కారును వదిలిపెట్టి నిందితుడు పారిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది.. స్నేహితులతో మద్యం సేవించి ఉండటం కారణంగా ఈ ఘటన జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రమాదానికి కారణమైన కారు నిజామాబాద్ కు చెందిన హర్షవర్థన్ పేరుతో రిజిస్ర్టార్ అయి ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: Phone Tapping Case: గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాపింగ్.. బీజేపీ సీరియస్

అసలేం జరిగిందంటే?
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది. ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిందితులు కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారు నంబరు ప్లేట్ ఆధారంగా యజమానిని గుర్తించారు.

READ MORE: Dil Raju: ఐటీ సోదాలు కామన్‌, ఆస్తుల పత్రాలు దొరకలేదు : దిల్ రాజు కీలక ప్రకటన!

 

Exit mobile version