NTV Telugu Site icon

Chalo Rajahmundry : వాహనాల తనిఖీలు ముమ్మరం.. ఆంధ్ర చెక్ పోస్టులో అలర్ట్

Cbn

Cbn

టీడీపీ చీఫ్‌ చంద్రబాబు అరెస్ట్‌ ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఛలో రాజమండ్రికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా సంఘీభావ ర్యాలీని విఫలం చేసేందుకు పోలీసు వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఛలో రాజమండ్రి అంటూ పిలుపు నివ్వడంతో పోలీసు వర్గాలు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే అన్ని రోడ్లన్నీ పోలీసులు దిగ్బంధనం చేశారు. తిరువూరు, జంగారెడ్డి గూడెం కూనవరం వెళ్లే రోడ్లపై పోలీసులు భారీ భారీగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అశ్వరావుపేట నుంచి రాజమండ్రి, భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్లే ప్రధానమైన రహదారులపై బారి కెడ్ల ను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం ర్యాలీ నిర్వహిస్తామని సోషల్ మీడియా లో చంద్రబాబు అభిమానులు ప్రకటన జారీ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Also Read : JDS: బీజేపీతో జేడీఎస్ పొత్తు.. కీలక ముస్లిం నేత రాజీనామా..

తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్న దృశ్యాలు ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో ఏర్పాటు చేసిన బారికేడ్లను చూపించాయి. ఛలో రాజమండ్రికి ఆంధ్రా పోలీసులు అనుమతి నిరాకరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. నివేదికల ప్రకారం, రాష్ట్రంలోకి ఐటీ ఉద్యోగుల ప్రవేశాన్ని పరిమితం చేయాలని విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా పోలీసు అధికారులను ఆదేశించారు. విజయవాడలో సీఆర్‌పీసీ 144 సెక్షన్‌ కింద ఆంక్షలు విధించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని మైలవరం ఏసీపీ రమేష్‌ తెలిపారు.

Also Read : PM Modi: “ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్” ప్రపంచ వాణిజ్యానికి కీలకం..

Show comments