NTV Telugu Site icon

Kidnap Case: బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

Kidnapping 2

Kidnapping 2

Kidnap Case: నంద్యాల జిల్లా వాసి బ్యాంకాక్‌లో కిడ్నాప్ అయిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి బెంగుళూరు నుంచి బ్యాంకాక్ వెళ్తున్నట్టు కిడ్నాప్ అయిన మధుకుమార్‌ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురంకు చెందిన మధు కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్‌ అయ్యాడు. కిడ్నాప్ చేసిన దుండగులు 8 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. మధు కుమార్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ రీత్యా 24న బెంగళూరు నుంచి బ్యాంకాక్ వెళ్లాడు. తనను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, 8 లక్షలు ఇస్తే వదులుతామంటున్నారని 25న మధుకుమార్ తన అక్కకు మెస్సేజ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని, తన సెల్‌ఫోన్‌ నుంచి అక్క రాజ్యలక్ష్మికి మెసేజ్ చేశాడు. అనంతరం మధుకుమార్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఈ క్రమంలోనే మధుకుమార్ తల్లిదండ్రులు డోన్‌ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాపర్ల నుంచి తన కుమారుడిని కాపాడాలని విజ్ఞప్తి చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also: Uttam Kumar Reddy: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలే.. అధికారులకు మంత్రి వార్నింగ్..

బెంగళూరు ఎయిర్ పోర్టులో డోన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధు పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోనూ పోలీసులు విచారిస్తున్నారు. మధు కుమార్ బ్యాంకాక్‌కు వెళ్లాడా లేదా.. అన్న వివరాలు ఎయిర్ పోర్ట్ అధికారులను పోలీసులు కోరారు. ఎయిర్‌పోర్టు అధికారుల సమాచారం కోసం పోలీసులు చూస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.