Vizag: విశాఖలోని ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భారీ కంటైనర్ పట్టుబడింది. ఈరోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాసలో వేకువజామున ఒక కంటైనర్ గంజాయి లోడుతో వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఈబీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అది గమనించిన కంటైనర్ డ్రైవర్ ఎస్‌ఈబీ పోలీసులను ఢీకొట్టి పరారయ్యాడు. వాహనాన్ని వెంబడిస్తూ వచ్చిన పోలీసులకు విశాఖలోని ఆనందపురం హైవే వద్ద ఈ భారీ కంటైనర్ పట్టుబడింది.. డ్రైవర్ తోపాటు క్లీనర్ పరారవడంతో కంటైనర్‌ను పోలీసులు ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు… మరి ఆ కంటైనర్ లో ఏముందో అన్న సస్పెన్షన్ కాసేపు కొనసాగింది.
Read Also: MP Bharath: గుంటనక్కలు కాసుకుని కూర్చున్నారు.. ప్రజలు గమనించి ఓటేయాలి!
అనంతరం ఆ కంటైనర్‌ను ఆనందపురం పోలీసులు తెరవగా.. అందులో భారీ గంజాయి బయటపడింది. 13 బస్తాల్లో ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. పరదేశిపాలెంలో ఒక కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నామని.. ఆ కంటైనర్‌లో గంజాయి ఉందని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు.