NTV Telugu Site icon

RPF Police Beats Child: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న చిన్నారిపై పోలీసుల దాడి..

Police

Police

దూర ప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కువగా ట్రైన్ లో జర్నీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి సమయంలో ఒకనొక సమయంలో ట్రైన్ మిస్ కావడం.. లేదా ఆలస్యం కావడం వంటివి జరుగుతాయి. దీంతో కొందరు ప్రయాణికులు తర్వాతి రైలు కోసం ఎదురుచూస్తుంటే.. మరికొందరు రైలు తప్పిపోయినందుకు నిరాశ చెందుతారు. అలాంటి సందర్భాల్లో వాళ్లు రైల్వే స్టేషన్‌లో వేచి ఉంటారు. ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ అలాగే నిద్రపోతుంటారు. దీంతో రైల్వే స్టేషన్‌లో పడుకున్న వారు.. కొత్తవారు కాబట్టి వెంటనే నిద్రపోవద్దని పోలీసు యంత్రాంగం ప్రయాణికులకు సలహా ఇస్తుంది. అయితే, ప్రస్తుతం ఓ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనపై ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఇందులో నిద్రిస్తున్న ఓ చిన్నారిని పోలీసులు తన్నారు. ఈ వీడియో చూసిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Hatya Pre Release event: మా రాతను మేమే రాసుకున్నాం.. కాస్త గుర్తుంచుకోండి: అడివి శేష్

అయితే, ఉత్తరప్రదేశ్‌లోని బెల్తారా రైల్వే స్టేషన్‌కి చెందిన రైల్వే పోలీసులు చేసిన పనికి సర్వాత్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న చిన్నారిని పోలీసులు తన్నడం మనం చూడవచ్చు. ఆ బాలుడిని కొట్టడంతో అక్కడే ఉన్న జనం ఒక్కసారిగా గుమిగూడారు. కానీ, ఆ పోలీసులు చిన్నారి గొంతుపై కాలు పెట్టి గట్టిగా నొక్కడంతో ఆ పిల్లవాడు తన తలతో పైకి ఎగరడం కనిపిస్తుంది. అయితే, పోలీసుల కర్కశత్వాన్ని ప్రదర్శించడాన్ని.. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. క్షణాల్లో వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన పలువురు పోలీసు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులపై కేసు నమోదైంది. రైల్వే పోలీసుల మీద నెటిజన్స్ మండిపడుతున్నారు.

Read Also: HD Kumaraswamy: జేడీఎస్‌ను దూరం పెట్టేశారా? యూపీఏ, ఎన్జీయే నుంచి అందని ఆహ్వానం