Site icon NTV Telugu

Hyderabad : డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్స్ అరెస్ట్..

Drugs

Drugs

హైదరాబాద్‌ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయించి సంపాదించిన డబ్బులను హవాలా మార్గంలో విదేశాలకు పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫారెక్స్ సేవలు, మనీ ట్రాన్స్ఫర్‌ల ద్వారా డబ్బులను దేశం వెలుపలికి తరలిస్తూ ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్న ముగ్గురు నైజీరియన్లు హైదరాబాద్‌లోనే నివాసముంటూ డ్రగ్స్ రాకపోకల్ని నిర్వహిస్తున్నట్లు నార్కోటిక్ బ్యూరో తెలిపింది. ప్రస్తుతం ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

READ MORE: Allagadda: ఎస్ఐ వేధింపులు భరించలేక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..

కాగా… గతేడాది ఫిబ్రవరిన దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన నేరగాడిని టీన్యాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రానికి చెందిన ఇవూలా ఉడోక స్టాన్లీ ఉత్తర గోవాలోని కండోలింలో నివసిస్తూ మత్తు దందా కొనసాగిస్తున్నాడు. కొరియర్‌ ద్వారా మాదకద్రవ్యాలను రవాణ చేసి తీసుకువస్తున్నాడు. గోవా నుంచి వాటిని హైదరాబాద్‌కు చేరుస్తూ అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు. ఇతన్ని టీన్యాబ్‌ పోలీసులు ఎస్‌ఆర్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద పట్టుకోవడంతో మాదకద్రవ్యాల బండారం బయటపడింది. ఇలాగే చాలా మంది నైజీరియన్స్ డ్రగ్స్ మాఫీయాలో మునిగి తేలుతున్నారు. తాజాగా మారో ముగ్గురు పట్టుబడ్డారు.

READ MORE: Jagtial District: ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు..

Exit mobile version