Site icon NTV Telugu

Polavaram Project: నేడు పోలవరంకు నిపుణుల బృందం

Polavaram

Polavaram

Polavaram Project: నేటి నుంచి నాలుగు రోజులపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం పర్యటించనుంది.కొత్తగా నిర్మించనున్న డయాఫ్రమ్ వాల్, ఇసిఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలపై ప్రాజెక్టు అధికారులతో కలిసి ఈ బృందం చర్చించనుంది..ముందుగా విదేశీ నిపుణులు, ఇంజినీర్లు ప్రాజె క్టును ఆమూలాగ్రం పరిశీలించనున్నారు. గతంలో వారు సూచించిన మేరకు చేసిన పరీక్షల్లో ఎలాంటిఫలితాలొచ్చాయి, కాఫర్‌డ్యాంల భద్రతకు తీసుకోవా ల్సిన చర్యలేంటి తదితర అంశాలపై చర్చిస్తారు. 7వ తేదీన కొత్తడయా ఫ్రంవాల్‌ నిర్మాణం, డిజైన్లపై, 8న ప్రధానడ్యాం నిర్మాణంపై కీలక చర్చ జరపనున్నారు. 8నప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత నియంత్రణ అంశాలపైఅధికారులతో సమీక్షనున్నారు. మూడేళ్ల పాటు పురోగతి లేని పోలవరం పనులు కొలిక్కి తెచ్చేందుకుఇప్పటికే వారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మరికొన్ని అంశాలపై స్పష్టత కోసం నాలుగు రోజుల భేటీకీలకంకానుంది. డిజైన్లు, నిర్మాణ షెడ్యూల్‌ ఓకొల్కికి వచ్చే అవకాశం ఉంది.

Kasthuri: “నటి కస్తూరిపై కేసు”.. 4 సెక్షన్లలో ఎఫ్ఐఆర్ నమోదు

Exit mobile version