Poco X7Series: పోకో అతి త్వరలో పోకో M7 ప్రో 5G, పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ లను భారతదేశంలో విడుదల చేయబోతోంది. వివిధ మార్కెట్ల కోసం బ్రాండ్ పోకో X7 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోకో X7 Neo, పోకో X7, పోకో X7 Pro వంటి పరికరాలపై కూడా బ్రాండ్ పని చేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది బ్రాండ్ X7 ప్రో ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను కూడా తీసుకువస్తుందని సమాచారం. ఇది “ఐరన్ మ్యాన్ థీమ్” పై ఆధారపడి ఉంటుంది.
నివేదిక ప్రకారం.. Poco X7, Poco X7 Pro ఐరన్ మ్యాన్ ఎడిషన్‌లను మనం చూడవచ్చు. రెండు పరికరాలకు ఒకే మోడల్ నంబర్ 2412DPC0AG ఉంది. ఈ నేపథ్యంలో, రెండు ఫోన్‌లు ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే, ఐరన్ మ్యాన్ ఎడిషన్‌లో ఎక్కువ ర్యామ్, స్టోరేజ్ ఉండవచ్చు. ఇది ఐరన్ మ్యాన్ నేపథ్య UI, స్పెసిఫికేషన్స్, ప్రత్యేక ప్యాకేజీలతో కూడిన పరిమిత ఎడిషన్ ఫోన్‌గా ఉండే అవకాశం ఉంది. Poco X7 సిరీస్ Redmi Note 14 5G, Redmi Note 14 Pro 5G లకు అప్డేటెడ్ వెర్షన్‌లు గా ఉండవచ్చు. Poco X7 Pro మోడల్ NBTC సర్టిఫికేషన్‌ను పొందింది. ఈ X7 సిరీస్ జనవరిలో థాయ్‌లాండ్, ఇతర దేశాల మార్కెట్‌లలో లాంచ్ అయ్యే అవకాశం కనపడుతోంది.
Also Read: Raj Kapoor: పాకిస్థాన్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడి శత జయంతి వేడుకలు…