Poco X7 5G: Poco కొత్త X7 సిరీస్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో Poco X7 5G, Poco X7 Pro 5G లాంచ్ చేయబడ్డాయి. ఇక Poco X7 5G స్పెసిఫికేషన్స్ చూస్తే.. Poco X7 6.67 అంగుళాల AMOLED స్క్రీన్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్షన్ 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా సెన్సార్ ఫోన్ వెనుక భాగంలో అందించబడింది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్ లో 5500 mAh బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో అందించబడింది. ఈ ఫోన్ 47 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుందని కంపెనీ పేర్కొంది. Poco X7 5G ఫోన్ ధర విషయానికి వస్తే.. 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999 గా నిర్ణయించారు. అలాగే 8 GB RAM + 256 GB స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ యొక్క టాప్ వేరియంట్ ధర 23,999 రూపాయలుగా నిర్ణయించారు. ఈ మొబైల్ కాస్మిక్ సిల్వర్, గ్లేసియర్ గ్రీన్, ఎల్లో కలర్స్‌లో లభ్యమవుతుంది.
Also Read: Suriya : మరోసారి విలన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే
ఇక Poco X7 Pro 5G విషయానికి వస్తే ఇందులో.. ఫోన్ రెండు వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 8 GB RAM + 256 GB స్టోరేజ్, 12 GB RAM + 256 GB స్టోరేజ్ అందుబాటులో ఉంటాయి. 8 జీబీ వేరియంట్ ధర రూ.27,999గా, 12 జీబీ వేరియంట్ ధర రూ.29,999గా నిర్ణయించారు. మీరు ఈ మొబైల్ ను నెబ్యులా గ్రీన్, బ్లాక్, ఎల్లో మూడు రంగులలో సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ విషయానికి వస్తే .. ఈ ప్రో వేరియంట్ 6.73 అంగుళాల AMOLED స్క్రీన్‌తో 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కలిగి ఉంది. X7 సిరీస్‌లో ప్రారంభించిన ప్రో వేరియంట్‌లో Poco MediaTek Dimension 8400 అల్ట్రా ప్రాసెసర్‌ని ఉపయోగించింది. కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 కెమెరా సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు ఫోన్ వెనుక భాగంలో అందుబాటులో ఉంటుంది. అలాగే సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. ఇక ఈ మొబైల్ లో భారీ బ్యాటరీ కలిగి ఉంది. 6550 mAh బ్యాటరీతో 90 వాట్ల హైపర్‌ఛార్జ్ సపోర్ట్ అందించబడింది.