NTV Telugu Site icon

POCO C75 5G: ఇదేందయ్యా ఇది.. కేవలం రూ. 7999లకే ఇన్ని ఫీచర్లా!

Poco

Poco

POCO C75 5G: పోకో తన కొత్త ఎంట్రీ లెవల్ 5G స్మార్ట్‌ఫోన్ పోకో C75 5G ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎక్కువగా మొబైల్ ఉపయోగించే వారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది. భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ, 5G కనెక్టివిటీతో పాటు, ఆకర్షణీయమైన డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ముఖ్యంగా ఎనిమిది వేల కంటే తక్కువ ధరలో లభించడం ఈ ఫోన్‌కి అదనపు ఆకర్షణ. పోకో C75 5G 4GB RAM + 64GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 7999. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5% క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుందండోయ్.. ఈ ఫోన్ సిల్వర్‌ స్టార్ డస్ట్‌, ఆక్వా బ్లిస్‌, ఎన్‌ఛాంటెడ్‌ గ్రీన్‌ రంగులలో అందుబాటులో ఉంది.

Read Also: Nidhi Agrawal: వీర‌మ‌ల్లు ల్లో ఎన్నో స‌ర్‌ప్రైజ్‌లు దాగి ఉన్నాయి: నిధి అగర్వాల్

ఇక ఈ మొబైల్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఇందులో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ లభిస్తాయి. పెద్ద డిస్‌ప్లే కావడంతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఎక్కువగా చూడాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS, స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4GB RAM + 64GB స్టోరేజ్, 2 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు, మల్టీ టాస్కింగ్‌ కోసం ఈ చిప్‌సెట్ మద్దతునిస్తుంది.

Read Also: Nandamuri Balakrishna : కృష్ణవేణి మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా లభిస్తాయి. ఈ ధరలో మంచి కెమెరా క్వాలిటీని అందించేందుకు పోకో ప్రయత్నించింది. ఈ మొబైల్ లో 5160mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే రోజంతా స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. వీటితోపాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, GLONASS, USB Type-C ఛార్జింగ్ పోర్ట్, IP52 రేటింగ్ – డస్ట్, వాటర్ రెసిస్టెంట్ లభించనున్నాయి. మొత్తానికి తక్కువ ధరలో 5G ఫోన్ కోసం చూస్తున్న వారికి పోకో C75 5G బెస్ట్ ఆప్షన్. బడ్జెట్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్ కావడంతోపాటు, భారీ డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ లైఫ్, మంచి కెమెరా క్వాలిటీ కలిగి ఉంది. ముఖ్యంగా రూ. 8000 లోపు 5G ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్.