NTV Telugu Site icon

POCO C71: 6.88 అంగుళాల 120Hz డిస్ప్లే, 5200mAh బ్యాటరీతోపాటు సూపర్ ఫీచర్స్ తో రాబోతున్న పోకో C71

Poco C71

Poco C71

POCO C71: స్టైలిష్, మెరుగైన కెమెరాల ఫోన్స్ ను అందిస్తున్న పోకో సంస్థ భారీ ఫ్యాన్ బేస్ ను కలిగి ఉంది. వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తూ వస్తోంది. ఇకపోతే, గత ఏడాది విడుదలైన POCO C61 స్మార్ట్‌ఫోన్‌కు అప్డేటెడ్ గా ఏప్రిల్ 4న భారతదేశంలో కంపెనీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ POCO C71ని విడుదల చేయనున్నట్లు POCO ధృవీకరించింది. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD+ 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుందని POCO తెలిపింది. ఇందులో TUV తక్కువ బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సిర్కాడియన్ సర్టిఫికేషన్‌లు ఉన్నాయి. ఇది వెట్ డిస్‌ప్లే సపోర్ట్‌తో వస్తుంది.

Read Also: Sharwanand : శర్వానంద్ ‘నారి నడుమ మురారి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే..

POCO C71 పవర్ బ్లాక్, కూల్ బ్లూ, డెసర్ట్ గోల్డ్ వంటి మూడు రంగులలో వస్తుంది. దుమ్ము, ఫ్లాష్ నిరోధకత కోసం IP52 రేటింగ్‌లను కలిగి ఉంది. POCO ఈ ఫోన్ కోసం 5200mAh బ్యాటరీని అందిస్తుంది. ఇది ఈ బడ్జెట్ విభాగంలో అతిపెద్దది అని తెలిపింది. ఇది ఛార్జర్‌తో 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సపోర్ట్ వస్తుంది. దీనితో ముఖ్యంగా 3 సంవత్సరాల తర్వాత కూడా 80% బ్యాటరీ ఆరోగ్యాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. 32MP వెనుక కెమెరాతో పాటు సెకండరీ కెమెరా, అలాగే 8MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను అందిస్తోంది POCO. ఈ మొబైల్ 6GB RAM కలిగి ఉండి 6GB అదనపు వర్చువల్ RAM ను పెంచుకోవచ్చు. ఇది మైక్రో SD విస్తరణ స్లాట్‌తో కూడా వస్తుంది. ఇందులో స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

Read Also: Mad Square Director : ఈ స్థాయి అస్సలు ఊహించలేదు.. నాకు అత్యుత్తమ ప్రశంస అదే!

ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. POCO ఈ ఫోన్ కు 2 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌ను హామీ ఇస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 7000 ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.