POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POCO Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సందర్భంగా POCO భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 8, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఎంట్రీ లెవల్ నుంచి మిడ్-రేంజ్, ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ వరకు పలు పోకో (POCO) స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక ధరలను అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా ఫోన్ల ధరలు రూ.11,999 నుంచే ప్రారంభమవుతున్నాయి.
భారీ ఆఫర్లు
POCO ప్రీమియం సెగ్మెంట్లోని X8 సిరీస్‌పై కూడా ప్రత్యేక డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ఇందులో POCO X8, X8 Power, X8 Pro, X8 Pro Max మోడళ్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో బ్యాటరీ సామర్థ్యం, డిస్ప్లే టెక్నాలజీ, ప్రాసెసింగ్ పనితీరుపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది.
Also Read
- 1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
మిడ్-రేంజ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న POCO M8 సిరీస్‌లో M8x, M8 Power మోడళ్లు ఉన్నాయి. POCO M8x ధర రూ.17,999 నుంచి ప్రారంభం కాగా, POCO M8 Power ధర రూ.20,999 నుంచి మొదలవుతుంది.
బడ్జెట్ విభాగంలో POCO C81x, C81, C85x మోడళ్లపై డిస్కౌంట్ అందిస్తోంది. రోజువారీ పనులు, వీడియోలు చూడటం, ప్రాథమిక కనెక్టివిటీ అవసరాలకు అనుగుణంగా ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. POCO C81x 3GB + 64GB వేరియంట్ ధర రూ.12,499 ఉండగా, బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.11,999కే లభించనుంది. మరి ఏ మొబైల్స్ పై ఎంత ఆఫర్స్ ఉన్నాయంటే..
బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా POCO C81x 3GB + 64GB వేరియంట్ సాధారణంగా రూ.12,499 ధరకు లభిస్తుండగా.. సేల్‌లో రూ.11,999కే అందుబాటులోకి రానుంది. ఇంకా POCO C81 4GB + 64GB వేరియంట్ ధర రూ.13,499 నుంచి రూ.12,999కి తగ్గింది. ఇక POCO C85x 4GB + 64GB వేరియంట్ రూ.14,999 నుంచి రూ.13,999కి, 4GB + 128GB వేరియంట్ రూ.15,999 నుంచి రూ.14,999కి అందుబాటులో ఉంటుంది.
మిడ్‌రేంజ్ విభాగంలో POCO M8x 4GB + 128GB వేరియంట్ ధర రూ.20,999 నుంచి రూ.17,999కి తగ్గింది. 6GB + 128GB వేరియంట్ రూ.22,999 నుంచి రూ.19,999కి లభించనుంది. POCO M8 Power 6GB + 128GB వేరియంట్ రూ.24,999 నుంచి రూ.20,999కి, 8GB + 128GB వేరియంట్ రూ.27,999 నుంచి రూ.23,999కి తగ్గింది. ప్రీమియం విభాగంలో POCO X8 6GB + 128GB వేరియంట్ రూ.29,999 నుంచి రూ.24,999కి, 8GB + 128GB వేరియంట్ రూ.32,999 నుంచి రూ.27,999కి, 8GB + 256GB వేరియంట్ రూ.35,999 నుంచి రూ.30,999కి అందుబాటులోకి రానుంది.
అలాగే POCO X8 Power 8GB + 128GB వేరియంట్ రూ.35,999 నుంచి రూ.29,999కి, 8GB + 256GB వేరియంట్ రూ.38,999 నుంచి రూ.32,999కి తగ్గింది. POCO X8 Pro 8GB + 256GB వేరియంట్ రూ.39,999 నుంచి రూ.33,999కి, 12GB + 256GB వేరియంట్ రూ.42,999 నుంచి రూ.36,999కి లభించనుంది. టాప్-ఎండ్ మోడల్ POCO X8 Pro Maxలో 12GB + 256GB వేరియంట్ సాధారణంగా రూ.48,999 ధర ఉండగా, బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.42,999కే లభిస్తుంది. ఇక 12GB + 512GB వేరియంట్ ధర రూ.52,999 నుంచి రూ.46,999కి తగ్గింది. ఈ ప్రత్యేక సేల్ ధరలు అక్టోబర్ 8, 2026 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో పరిమిత కాలానికి అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!