Site icon NTV Telugu

Pocharam Srinivas Reddy : బండి సంజయ్ ఈ రకంగా మాట్లాడడం మాతృ మూర్తిని అవమానించడమే

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy

రాజకీయాలు పక్కన పెట్టి దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని, రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదన్నారు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ ఒక తల్లికి పుట్టి ఉంటే ఈ విధంగా మాట్లాడడని ఆయన నిప్పులు చెరిగారు. ఈ రకంగా మాట్లాడడం మాతృ మూర్తిని అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. జాగ్రత్తగా ఉండండి అందరికీ చీము, నెత్తురు ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

Also Read : Antara Motiwala Marwah : బేబీ బంప్‌తో ర్యాంప్‌ వాక్‌ చేసిన మోడల్‌.. నెట్టింట వైరల్‌

తల్లికి పుట్టిన వాడు అసభ్య పదజాలం వాడడని ఆయన విమర్శించారు. మా సైన్యం బయటకు వస్తే మీరు ఒక్క కార్నర్ మీటింగ్ జరపరని ఆయన వ్యాఖ్యానించారు. తొమ్మిది ఏళ్లుగా రైతులకు, పేదలకు మంచి చేసిన ఒక్క పని చెప్పండి మేము వంద చెబుతామన్నారు. ఈడీ విచారణ జరిగితే మొదట అదానీపై జరగాలన్న ఆయన.. మరోమారు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమన్నారు. మాటలు వెనక్కి తీసుకుని కవితకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అన్నదమ్ముల్లాగా ఉండే రాజ్యంలో కుల, మతాలతో చిచ్చుపెడుతున్నారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ బజారు రౌడీలాగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

Also Read : Kiran Kumar Reddy: కాంగ్రెస్‌కి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా.. త్వరలోనే ఆ పార్టీలోకి?

Exit mobile version