NTV Telugu Site icon

PM Letter: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‭కి ప్రధాని నరేంద్ర మోడీ లేఖ

Pm Modi

Pm Modi

PM Letter: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్క చీటి సకులమ్మ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‭కి సంతాప సందేశాన్ని పంపారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో వున్న కేసీఆర్ కి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ లేఖను రాసారు. ఈ లేఖలో ప్రధాని నరేంద్ర మోడీ.. శ్రీమతి చీటి సకలమ్మ గారి మరణవార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. ఈ అనుకోని ఘటన ఎంతో బాధకు గురిచేసిందని, కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మిగిలిపోతుందని అన్నారు.

Also Read: iQOO Neo 10R:పవర్ ఫుల్ ఫీచర్స్ తో.. ఐకూ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్

శ్రీమతి చీటి సకలమ్మ అనురాగశీలి, మానవీయ దయా గుణాలు కలిగిన గొప్ప వ్యక్తి అని మోడీ అన్నారు. కుటుంబాన్ని ప్రేమగా, శ్రద్ధగా పోషించి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆమె అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆమె చూపిన సానుభూతి, మానవతా గుణాలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని, ఆమె సాన్నిహిత్యాన్ని పొందిన ప్రతి ఒక్కరు గౌరవంతో, ప్రేమతో ఆమెను స్మరించుకుంటారని అన్నారు. అలాగే కుటుంబ సభ్యులకు ఆమె అందించిన విలువలు, నడిపించిన మార్గదర్శనం ఎప్పటికీ వారికి ప్రేరణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆమెతో గడిపిన మధుర జ్ఞాపకాలు ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, మనోబలాన్ని అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చీటి సకలమ్మ అకాల మృతి పట్ల తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని తెలిపారు. ఈ విషాద క్షణాలను అధిగమించే శక్తి, సహనాన్ని కుటుంబ సభ్యులు పొందాలని మోడీ లేఖలో ఆకాంక్షించారు.