Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు రావు కన్నుమూతపై సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్న ఆయన.. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని గుర్తుచేశారు.. పత్రికారంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు.. పత్రిక, సినీ, వ్యాపార రంగాలపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.. రామోజీ రావు మరణించడం చాలా బాధాకరం. అతను భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. అతని గొప్ప రచనలు జర్నలిజం మరియు చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయి. ఆయన ప్రయత్నాల ద్వారా, అతను మీడియా మరియు వినోద ప్రపంచంలో ఆవిష్కరణ మరియు శ్రేష్ఠత కోసం కొత్త ప్రమాణాలను నెలకొల్పాడని ప్రశంసించారు.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
ఇక, రామోజీ రావు.. భారతదేశ అభివృద్ధి పట్ల చాలా మక్కువ చూపేవారు అని తెలిపారు నరేంద్ర మోడీ… నేను ఆయనతో సంభాషించడానికి మరియు అతని జ్ఞానం నుండి ప్రయోజనం పొందేందుకు అనేక అవకాశాలు పొందడం నా అదృష్టంగా పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు అసంఖ్యాక అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను.. ఓం శాంతి… అంటూ ట్వీట్ చేశారు నరేంద్ర మోడీ. కాగా, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావును నానక్‌రామ్‌గూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ రామోజీరావు అస్తమించారు.. ఆ తర్వాత ఆయన భౌతికకాయాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి తరలించారు.. ఇక, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీ మృతికి సంతాపం ప్రకటించారు.. అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
https://x.com/narendramodi/status/1799271251082608841