PM Modi Net Worth: “మూడు సార్లు సీఎం, మూడోసారి పీఎం”.. ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi Net Worth: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 75 ఏళ్లు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వడ్నగర్లో జన్మించిన మోడీ, స్వాతంత్ర్యం తర్వాత భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2001 నుంచి 2014 వరకు వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీ, 2014 మేలో దేశ 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రస్తుతం ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి మోడీ ఆస్తుల విషయానికి వస్తే.. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఉన్న అఫిడవిట్ ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.3 కోట్లకు పైగా ఉంది. మోడీకి చెందిన చర ఆస్తుల మొత్తం విలువ రూ.3,02,06,889. ఇందులో ఎక్కువ భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లే. వాటి విలువ రూ.2.85 కోట్లకు పైగా ఉంది. ఇతర ఆస్తుల విషయానికి వస్తే, 45 గ్రాముల బరువున్న నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి అంచనా విలువ రూ.2.67 లక్షలు. నగదు రూపంలో రూ.52,920 ఉంది. జాతీయ సేవింగ్స్ సర్టిఫికెట్లు రూ.9.12 లక్షల విలువ కలిగి ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను మినహాయింపు కింద రూ.3.33 లక్షలు చూపించారు. స్థిరాస్తులు లేవు. అంటే భూములు, ఇళ్లు లేదా ఇతర ఆస్తులు ఆయన పేరుపై లేవన్న మాట. అఫిడవిట్లో ఆయన భార్యగా జశోదాబెన్ పేరు ఉంది. అయితే ఆమె వద్ద ఉన్న ఆస్తుల వివరాలు ‘తెలియదు’ అని నమోదు చేశారు.
READ MORE: Trump-Modi: భారత్‌పై గురి.. భారీగా సుంకాలు పెంచే యోచనలో ట్రంప్!
Also Read
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
- Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
- Special Trains: పండుగ సీజ్‌లో రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు.. 60 రోజుల ముందే టికెట్ బుకింగ్
- BRS Protest: గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
నరేంద్ర దామోదరదాస్ మోడీ రాజకీయ ప్రస్థానం ఆర్ఎస్ఎస్తో ప్రారంభమైంది. 1985లో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన క్రమంగా పార్టీ నాయకత్వంలో కీలక స్థానానికి చేరుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తరువాత దేశవ్యాప్తంగా నాయకుడిగా ఎదిగి, వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు. ప్రస్తుతం వారణాసి ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. ప్రధానమంత్రిగా మోడీ అనేక కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, జనధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు దేశవ్యాప్తంగా పెద్ద మార్పులు తీసుకొచ్చాయి. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి కీలక నిర్ణయాలు కూడా ఆయన పాలనలోనే జరిగాయి. సాధారణ కుటుంబంలో పుట్టిన మోడీ చిన్నతనంలో వడ్నగర్ రైల్వే స్టేషన్ వద్ద తండ్రి నడిపే టీ స్టాల్లో సహాయం చేసినట్టు చెప్పుకుంటారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందినప్పటికీ, ఇప్పటికీ ఆయన సాధారణ జీవనశైలికే ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం.
తాజావార్తలు
-
Cancer: వాసనతో కుక్క క్యాన్సర్‌ను గుర్తించగలదా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
-
MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
-
PM Modi: పారిస్‌లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
-
Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
-
Special Trains: పండుగ సీజ్‌లో రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు.. 60 రోజుల ముందే టికెట్ బుకింగ్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!