Modi’s gifts to Putin: నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రధాని నరేంద్రమోడీ ఘనంగా స్వాగతించారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా పుతిన్‌కు మోడీ పలు గిఫ్ట్‌లను ఇచ్చారు. బ్రహ్మపుత్ర సారవంతమైన నేతల్లో పండిన అస్సాం బ్లాక్ టీ, ముర్షిదాబాద్ సిల్వర్ టీ సెట్, చేతితో తయారు చేసిన వెండి గుర్రం, ఆగ్రా నుంచి పాలరాయి చెస్ సెట్, కాశ్మీరీ కుంకుమ పుప్పు, రష్యన్ భాషలో ఉన్న భగవద్గీతను బహుకరించారు.
Read Also: Madhya Pradesh: 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్.. మధ్యప్రదేశ్‌లో టెన్షన్ టెన్షన్..
సారవంతమైన బ్రహ్మపుత్ర మైదానాల్లో పండించిన అస్సాం బ్లాక్ టీ రుచి అమోఘంగా ఉంటుంది. 2007లో దీనికి GI ట్యాగ్ దక్కింది. దీనికి అనుబంధంగా ముర్షిదాబాద్ సిల్వర్ టీ సెట్ కూడా ఇచ్చారు. మహారాష్ట్రలో చేతితో తయారు చేయబడిన వెండి గుర్రం బొమ్మ కూడా పుతిన్ కు ఇచ్చిన బహుమతుల లిస్టులో ఉంది. ఈ గుర్రం గౌరవం, శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఎర్ర బంగారంగా ప్రసిద్ధి చెందిన కాశ్మీరీ కుంకుమ పువ్వు వంటలు, ఔషధ ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారతీయ కళాత్మకతను ప్రదర్శించేలా పాలరాయి చెస్ సెట్ బహుకరించారు.
